ఎంత పిచ్చి ఉంటే మాత్రం భర్తను పట్టించుకోవా?.. నెటిజన్స్‌ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

Vidya Balan: భర్తను లెక్క చేయవా? నీకెంత పొగరు? విద్యాబాలన్‌పై ట్రోలింగ్‌

Published Thu, Dec 22 2022 7:11 PM

Vidya Balan Disinterested In Getting Clicked with Hubby Siddharth Roy Kapur - Sakshi

కెమెరా అంటే సెలబ్రిటీలకు మహా ఇష్టం. షూటింగ్‌లోనే కాదు, బయట ఎవరైనా ఫోటోలు క్లిక్‌ చేయడానికి ప్రయత్నించినా ఐయామ్‌ రెడీ అంటూ వెంటనే పోజులిస్తుంటారు. తాజాగా ఓ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన విద్యాబాలన్‌ కూడా కారు దిగగానే ఇదిగో వస్తున్నా అంటూ నడుముకు చేయి పెట్టుకుని వడివడిగా నడుచుకుంటూ వచ్చి అందంగా ఫోటోలు దిగింది. అంతా బానే ఉంది కానీ విద్యాబాలన్‌ తన ఫోటోల మీద పెట్టిన దృష్టి భర్త సిద్దార్థ్‌ రాయ్‌ కపూర్‌ మీద పెట్టినట్లు కనిపించడం లేదు.

విద్యాతో ఫోటో దిగేందుకు సిద్దార్థ్‌ రెడీ అయినా ఆమె మాత్రం భర్తను పట్టించుకోలేదు. దీంతో అతడు ఇబ్బందికరంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అవేమీ పట్టించుకోని నటి హ్యాపీ ఎక్స్‌ప్రెషన్స్‌తో పోజులివ్వడంలో నిమగ్నమైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఎంత ఫోటోల పిచ్చి ఉంటే మాత్రం భర్తను కూడా మైమరచిపోతారా?', 'అసలు వీళ్ల దాంపత్య జీవితం బాగానే ఉందా?' అని కామెంట్లు చేస్తున్నారు. ఆమెతో కలిసి ఫోటో దిగాలనుకున్న భర్తను విద్యాబాలన్‌ ఏమాత్రం లెక్క చేయకుండా పొగరు చూపించిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం విద్యాబాలన్‌ చబ్బీగా ఎంత బాగుందోనని మురిసిపోతున్నారు.

చదవండి: అబ్బా, నీ ముఖం చూడలేకపోతున్నాం.. స్టార్‌ కిడ్‌పై ట్రోలింగ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement