భూమికను చంపేయాలన్నంత కోపం వచ్చింది: హీరో శ్రీరామ్‌ | Sakshi
Sakshi News home page

Sriram: అందుకే 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' మూవీ వదులుకున్నా.. భూమికతో గొడవలు..

Published Mon, Nov 20 2023 2:14 PM

Sriram Missed Amma Nanna o Tamila Ammayi - Sakshi

శ్రీరామ్‌.. ఈయన అసలు పేరు శ్రీకాంత్‌. కానీ తెలుగులో ఈ పేరుతో ఇదివరకే ఓ నటుడు ఉండటంతో శ్రీరామ్‌గా వెండితెరపై అడుగుపెట్టాడు. తండ్రి బ్యాంకు ఉద్యోగి. తల్లి కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తండ్రి మొదట్లో నాటకాలు వేసి కళాకారుడిగా గుర్తింపు పొందాడు. అలా చిన్నతనంలోనే శ్రీరామ్‌కు నటన మీద ఆసక్తి ఏర్పడింది. మొదట్లో నాటకాలు వేసిన ఇతడికి కెరీర్‌ ప్రారంభంలో సినిమా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయి. హీరోగా ఛాన్సులిస్తామన్నవాళ్లు చివర్లో ఇతడిని తీసేసి వేరేవాళ్లతో షూటింగ్‌ మొదలుపెట్టేవాళ్లు.

తెలుగులో ఎంట్రీ
అలా వరుస షాకుల అనంతరం రోజా కూటం అనే తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఒకరికి ఒకరు మూవీతో తెలుగు వారికీ దగ్గరయ్యాడు. తమిళంలో హీరోగా కొనసాగిన ఇతడు తెలుగులో మాత్రం సెకండ్‌ హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిపోయాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న శ్రీరామ్‌​ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

ఆ పరిస్థితిలో లేను.. అందుకే!
'నేను ఒకరికి ఒకరు, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి.. రెండు సినిమాలకు ఒకేసారి సంతకం చేశాను. రెండు సినిమాలు ప్రకటించారు. అయితే అప్పుడు నేను ఆస్పత్రిపాలై ఉన్నాను. ఫైట్స్‌ చేసే పరిస్థితిలో లేను. నా కోసం పోరాట సన్నివేశాలను తగ్గించడం అస్సలు కరెక్ట్‌ కాదు. అలా నేను నటించి సినిమాకు న్యాయం చేయలేను అనే ఆ ప్రాజెక్ట్‌ నుంచి బయటకు వచ్చేశాను.

పారిపోయింది.. అందుకే
హీరోయిన్‌ భూమికతో గొడవలు కూడా జరిగాయి. సగం పాట అయిపోయాక సెట్‌ నుంచి పారిపోయింది. ఆ తర్వాత ఓ రోజు ఎయిర్‌పోర్ట్‌లో కనిపించినప్పుడు షూటింగ్‌ ఎలా జరిగింది? అని అడిగింది. కత్తి తీసుకుని అక్కడే పొడిచేయాలనిపించింది. ఈ మధ్యే మేమిద్దరం మాట్లాడుకున్నాం.. అప్పటి సంఘటన తలుచుకుని నవ్వుకున్నాం. ఇప్పుడంటే నవ్వుకుంటున్నాం కానీ ఆ రోజు మాత్రం చాలా కోపమొచ్చింది' అని చెప్పుకొచ్చాడు శ్రీరామ్‌.

చదవండి: లగ్జరీ లైఫ్‌ వదిలి ఇండియాకు.. హీరోగా సూపర్‌ సక్సెస్‌.. కానీ..

Advertisement
 
Advertisement
 
Advertisement