టాలీవుడ్‌లో సూపర్‌ హిట్ జోడీ.. ఎంత చిలిపిగా ఉన్నారో చూడండి!! | Hero Srikanth Hilarious Fun With Rashi At Rudram Kotta Pre-Release Event; Video Viral - Sakshi
Sakshi News home page

Raasi - Srikanth: ఏం జోక్ వేసుకున్నారో.. ఆ రోజులు మళ్లీ గుర్తుకొచ్చాయి!!

Published Tue, Sep 26 2023 6:37 PM

Raasi and Srikanth Funny Video Goes In Social Media  - Sakshi

శ్రీకాంత్, రాశి ఈ జోడీ వెండితెరపై ఎన్నో చిత్రాల్లో నటించింది. ప్రేయసి రావే, అమ్మో! ఒకటో తారీఖు, దీవించండి, పండగ, గిల్లికజ్జాలు, సరదా సరదాగా, మా ఆవిడమీద ఒట్టు.. మీ ఆవిడ చాలామంచిది లాంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. అయితే చాలా రోజుల తర్వాత ఇటీవలే వీరిద్దరు జంటగా కనిపించారు. అప్పట్లో సూపర్‌ హిట్‌ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట.. ఓకే వేదికపై కనిపించడంతో అభిమానులు వీరి కాంబినేషన్‌పై వచ్చిన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రుద్రంకోట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదికగా నిలిచింది. ఈవెంట్‌లో పాల్గొన్న రాశి,  శ్రీకాంత్‌ వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

(ఇది చదవండి: అందుకే ‘పెదకాపు’ అని టైటిల్‌ పెట్టాం: నిర్మాత)

అయితే ఈ వేడుకలో పాల్గొన్న వీరిద్దరు చాలా చిలిపిగా ప్రవర్తించారు. పక్క పక్కనే నిలబడి రాశి, శ్రీకాంత్ వేదికపై నవ్వుతూ కనిపించారు. ఒకరి వైపు ఒకరు చూస్తూ ముసి ముసి నవ్వులు నవ్వారు. అయితే వారిద్దరి మధ్య సంభాషణ పక్కనపెడితే.. ఆ జోడీ ఓకే వేదికపై కనిపించడం అభిమానులకు కనువిందు చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

అయితే ఈవెంట్‌లో రాశి పలు ఆసక్తికర కామెంట్స్ కూడా చేసింది. తాము ఓకే ఏడాదిలో ఇద్దరం వేరు వేరుగా ఏకంగా ఎనిమిది చిత్రాల్లో నటించామని తెలిపింది. 2000 సంవత్సరంలో రాశి నటించిన పోస్ట్‌మ్యాన్‌, ఒకే మాట, మూడు ముక్కలాట, దేవుళ్లు సహా 8 తెలుగు చిత్రాలు, మూడు తమిళ సినిమాలు విడుదలయ్యాయి. క్షేమంగా వెళ్లి లాభంగా రండి!, ‘చాలా బాగుంది..!, చూసొద్దాం రండి, సకుటుంబ సపరివార సమేతం లాంటి చిత్రాలతో అదే ఏడాదిలో శ్రీకాంత్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. 

(ఇది చదవండి: తెలుగు సీరియల్ నటి.. ఇంతలా రెచ్చిపోవడానికి కారణం!)
 
కాగా.. రాశి ప్రస్తుతం జానకీ కలగనలేదు సీరియల్‌తో బుల్లితెరపై సందడి చేస్తోంది. శ్రీకాంత్ సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.  ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న దేవర, రామ్‌ చరణ్‌ హీరోగా రూపొందుతున్న గేమ్‌ ఛేంజర్‌లో  కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ కీలక పాత్రలో నటించిన రామ్ పోతినేని స్కంద ఈ నెల 28న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement