చిన్న సినిమాలు సక్సెస్‌ కావాలి | Sakshi
Sakshi News home page

చిన్న సినిమాలు సక్సెస్‌ కావాలి

Published Mon, Jun 12 2023 6:35 AM

IQ Telugu Movie Press Meet - Sakshi

‘‘చిన్న సినిమాలు సక్సెస్‌ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది. లక్ష్మీపతిలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు. ‘ఐక్యూ’ సినిమా సక్సెస్‌తో ఆయన మరిన్ని సినిమాలు ప్లా¯Œ   చేస్తున్నారు’’ అని నిర్మాత ప్రసన్న కుమార్‌ అన్నారు. సాయి చరణ్, పల్లవి జంటగా జీఎల్‌బీ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఐక్యూ’.

కేఎల్‌పీ మూవీస్‌ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 2న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ–‘‘ఐక్యూ’ సినిమా కథ జనాలకు బాగా కనెక్ట్‌ అయింది.. అందుకే రెండో వారం కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది’’ అన్నారు. రచయిత ఘటికాచలం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement