ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలి | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలి

Published Mon, Apr 8 2024 1:15 AM

హోటల్‌లో అరటి ఆకులను పరిశీలిస్తున్న కమిషనర్‌ శ్రీనివాస్‌ - Sakshi

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరంలోని హోటళ్లు ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ బోనగిరి శ్రీనివాస్‌ ఆదేశించారు. ఆదివారం నగరంలోని పలు హోటళ్లను తనిఖీ చేశారు. కొన్ని హోటళ్లలో ప్లాస్టిక్‌ ప్లేట్స్‌కు బదులు, అరిటాకులు వాడడాన్ని అభినందించారు. అన్ని హోటళ్లు ప్లాస్టిక్‌ ప్లేట్స్‌ను వాడడం నిలిపివేయాలని, అరటి ఆకులు ఉపయోగించుకోవాలని సూచించారు. కమిషనర్‌ వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.మహేందర్‌, శ్యాం, నర్సయ్య, అమర్‌ ఉన్నారు.

స్పెషల్‌ అసిస్టెంట్లకు

రెమ్యూనరేషన్‌ పెంచాలి

కరీంనగర్‌: పదో తరగతి మూల్యాకనం స్పెషల్‌ అసిస్టెంట్లకు రెమ్యూనరేషన్‌ పెంచాలని కోరుతూ టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పోరెడ్డి దామోదర్‌రెడ్డి ఆదివారం రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావుకు ఫ్యాక్స్‌ ద్వారా, ఎంఈవో మధుసూదనచారికి రాతపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని హెచ్‌ఆర్‌ఏ పరిధిలో మాత్రమే పనిచేస్తున్న ఎస్‌జీటీ, పీఈటీలను తీసుకోవాలి కానీ జిల్లా కేంద్రం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో పనిచేస్తున్న వారికి విధులు కేటాయించారన్నారు. ఎనిమిది కిలోమీటర్ల దూరం దాటితే టీఏ, డీఏ మంజూరు చేయాలని కోరారు. సెలవు దినాల్లో పనిచేసిన స్పెషల్‌ అసిస్టెంట్లకు సీసీఎల్స్‌ మంజూరు చేయాలని పేర్కొన్నారు.

వైరాగ్యంకు శ్రీశ్రీ కళా వేదిక పురస్కారం

కరీంనగర్‌ కల్చరల్‌: వైరాగ్యం ప్రభాకర్‌కు పురస్కారం వరించింది. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా శ్రీశ్రీ కళా వేదిక, కోనసీమ రచయితల సంఘం, జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అమలాపూర్‌లో నిర్వహించిన 132వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో కరీంనగర్‌కు చెందిన ప్రభాకర్‌ శ్రీశ్రీ కళా వేదిక పురస్కారం అందుకున్నారు. శాలువా, మెమొంటో, ప్రశంసాపత్రం అందించి సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు, సాహితీవేత్తలు అభినందించారు.

ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ

కరీంనగర్‌రూరల్‌: కరీంనగర్‌ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళా శాలలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయు ల శిక్షణ ఆదివారంతో ముగిసింది. ఐటీ రంగంలో ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ అంశంపై వివిధ రంగాలకు చెందిన ఏడుగురు వక్తలు ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ వేది కగా శిక్షణ ఇచ్చారు. చివరిరోజు ఆదివారం ఇస్త్రో శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ ఇండస్ట్రీ 4.0 అనే అంశంపై ప్రసంగించారు. శిక్షణలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 313 మంది అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సమత, వైస్‌ ప్రిన్సిపాల్‌ సుష్మ, శిక్షణ సదస్సు కన్వీనర్‌ లలితా అశ్విని పాల్గొన్నారు.

నగరంలో పవర్‌కట్‌ ప్రాంతాలు

కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌లో విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు సబ్‌ స్టేషన్‌ నిర్వహణ, విద్యుత్‌ మరమ్మతు పనులు చేపడుతున్నందున సోమవారం ఉ.9 నుంచి మ.12 గంటల వరకు 33/11 కేవీ పద్మనగర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని మంకమ్మతోట, సంతోష్‌నగర్‌, వినాయక్‌నగర్‌, కుర్మవాడ, శ్రీహరినగర్‌, పీటీసీ, మార్కండేయనగర్‌, ప్రగతినగర్‌, రాజీవ్‌పార్కు, పాత లేబర్‌ అడ్డ, ఆదిత్య అపార్ట్‌మెంట్‌, సిద్ధార్థ స్కూల్‌, వాసర హాస్పిటల్‌, పారమిత, లారెల్‌ పాఠశాలల ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌–1 ఏడీఈ ఎస్‌.నరేందర్‌ తెలిపారు.

పురస్కారం అందుకుంటున్న ప్రభాకర్‌
1/2

పురస్కారం అందుకుంటున్న ప్రభాకర్‌

2/2

Advertisement
Advertisement