విటమిన్‌ టాబ్లెట్‌ అనుకుని ఎయిర్‌పాడ్‌ మింగేసింది.. తరువాత? | Sakshi
Sakshi News home page

విటమిన్‌ టాబ్లెట్‌ అనుకుని ఎయిర్‌పాడ్‌ మింగేసింది.. తరువాత?

Published Thu, Sep 14 2023 11:17 AM

Woman Accidentally Swallows Apple Air Pod Mistaking it for Vitamin Pill - Sakshi

టాబ్లెట్లు, మాత్రలు వేసుకునేవారు పొరపాటున ఉదయం వేసుకోవాల్సిన మందులను రాత్రి, రాత్రి వేసుకోవాల్సిన మందులను ఉదయం వేసుకుంటుంటారు. అయితే ఒక మహిళ విషయంలో దీనికి భిన్నంగా జరిగింది. అమెరికాకు చెందిన 52 ఏళ్ల టిక్‌టాకర్‌ ఆన్‌లైన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. తాను విటమిన్‌ ట్యాబ్లెట్‌గా భావించి తన భర్తకు చెందిన ఏపిల్‌ ఎయిర్‌పాడ్‌ ప్రోలోని ఒక దానిని మింగేశానని తెలిపింది. 

న్యూయార్క్‌ పోస్టులో పేర్కొన్న వివరాల ప్రకారం రియాల్టర్‌ తన్నా బార్కర్‌ తన స్నేహితురాలితో పాటు ఉదయం వాకింగ్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా స్నేహితురాలితో మాట్లాడుతూ విటమిన్‌ టాబ్లెట్‌ వేసుకోవాలనుకుంది. అయితే తన భర్తకు చెందిన ఒక ఎయిర్‌పాడ్‌ ‍ప్రోను మింగేసి నీళ్లు తాగింది.. 

ఈ సందర్భంగా బార్కర్‌ మాట్లాడుతూ..‘వాకింగ్‌ సమయంలో కొంతదూరం వెళ్లాక విటమిన్‌ టాబ్లెట్‌ వేసుకున్నాను. అయితే గొంతులో ఏదో ఆడ్డుపడినట్టు అనిపిస్తే నీళ్లు తాగాను. తరువాత తన స్నేహితురాలికి బైబై చెప్పాను. తిరిగి ఎయిర్‌పాడ్‌ చెవిలో పెడదామనుకుని, జేబులో చెయ్యిపెట్టేసరికి విటమిట్‌ ట్యాబ్లెట్‌ తగిలింది. దీంతో తాను పొరపాటున విటమిన్‌ ట్యాబ్లెట్‌ మింగేశానని గ్రహించాను. భగవంతుడా ఎంత పొరపాటు జరిగిపోయిందని మనసులోనే అనుకున్నాను. ఇంటికివెళ్లి భర్తకు ఈ విషయం చెప్పాను. ఆయన వెంటనే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకు. వాళ్లంతా నవ్వుతారు అని అన్నారని తెలియజేస్తూ, ఇప్పుడు ఏమి చేయాలని’ టిక్‌టాక్‌ యూజర్స్‌ను అడిగింది. 

ఈ వీడియో అమాంతం వైరల్‌గా మారింది. దీనిని చూసిన యూజర్స్‌ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్‌ ‘ఎయిర్‌పాడ్‌ నోట్లోకి వెళ్లాక ‘ఎయర్‌ఫుడ్‌’ అవుతుందన్నాడు. మరో యూజర్‌ ‘వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్లాలని’ సలహా ఇచ్చాడు. ఇంకొక యూజర్‌ అది ‘మలంలో బయటకు వచ్చేస్తుందని’ రాశాడు. 
ఇది కూడా  చదవండి: ఇనుపరేకు బాక్సులో యువతి మృతదేహం.. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు!

Advertisement

తప్పక చదవండి

Advertisement