బోర్‌ కొడుతుందా? వెరైటీగా ఇలా ట్రై చేయండి.. | Sakshi
Sakshi News home page

ఖాళీగా కూర్చున్నారా? బోర్‌ కొట్టకుండా వెరైటీగా ప్లాన్‌ చేయండిలా..

Published Wed, Dec 27 2023 12:00 PM

Things To Do When Your Bored Try This Often Free Ideas - Sakshi

సాధారణంగా మీకు బోర్‌ కొడితే ఏం చేస్తారు? సోషల్‌ మీడియాలోకి దూరిపోయి ఇన్‌స్టా రీల్స్‌ చూడటమో, వీడియో గేమ్స్‌ ఆడటమో చేస్తుంటాం. లేదా మరీ బోర్‌ కొడితే సరదాగా సినిమాలు,సిరీస్‌లు చూడటానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తాం. ఇవి ఎప్పుడూ చేసే పనులే. ఖాళీగా ఉన్నప్పుడే క్రియేటివ్‌ ఆలోచనలు బయటపడతాయి. అందుకే ఈసారి మీకు బోర్‌ కొడితే కాస్త వెరైటీగా ఇలా ట్రై చేసి చూడండి. 
 

రూమ్‌ క్లీనింగ్‌ అనేది ఓ మంచి థెరపీ లాంటిది. మీకు బోర్‌ కొట్టినప్పుడు మీ క్లాసెట్‌ను ఓపెన్‌ చేసి బట్టలు అన్నీ చక్కగా సర్దుకోండి. ఇలా చేస్తే మీకు మంచి టైంపాస్‌ అవడంతో పాటు ఓ పెద్ద టాస్క్‌ కూడా కంప్లీట్‌ అయినట్లుంటుంది. మనం ఉండే రూమ్‌, వాడే వస్తువులను నీట్‌గా, ఆర్డర్‌లో పెట్టుకుంటే ఆర్గనైజింగ్‌ స్కిల్స్‌ కూడా అబ్బుతాయి. 


► మీ ఫ్రెండ్స్‌కి ఫోన్‌ చేసి కాసేపు సరదాగా మాట్లాడుకోండి. కొన్నిసార్లు  బిజీ లైఫ్‌లో పాత ఫ్రెండ్స్‌ని మర్చిపోతుంతాం. అందుకే బోరింగ్‌గా ఫీల్‌ అయినప్పుడు మీ ఫ్రెండ్స్‌ లిస్ట్‌ని గుర్తు చేసుకొని ఆడియో, లేదా వీడియో కాల్‌ చేసి తనివితీరా మాట్లాడండి. 


► కొత్త రెసిపీ ప్రయోగం చేయండి. వంట చేస్తున్నప్పుడు మన దృష్టి అంత దానిమీదే ఉంటుంది కాబట్టి కొత్తగా ఏం చేయాలి? ఎలాంటి  ఇంగ్రీడియెంట్స్‌ వాడాలి అన్న ఆలోచనలు వస్తాయి. మీకు బేకింగ్‌ ఇష్టమైతే, కుకీస్‌, కప్‌ కేక్స్‌ వంటివి ట్రై చేసి చూడండి. 


► మీ దగ్గర బోలెడన్ని బట్టలు ఉన్నాయా? పాత బట్టలు ఏం చేయాలో తెలియకుండానే, కొత్తవి అవసరం లేకపోయినా కొంటున్నారా? అయితే ఓ పని చేయండి. మీకు అవసరం లేవు అనుకున్న బట్టలను లేనివాళ్లకు అయినా సహాయం చేయండి. కొంతమంది ఒక్కసారి వేసిన అవుట్‌ఫిట్స్‌ను మళ్లీ రిపీట్‌ చేయడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్లు చాలా బట్టలు ఇతరులకు హెల్ప్‌ చేయగలిగితే మంచిది. మీకు బొర్‌ కొట్టినప్పుడు మీ పాత దుస్తులు, ఫర్నీచర్‌.. ఇలా అవసరం లేని వస్తువులను ప్యాక్‌ చేసి చారిటీకి ఇవ్వడం అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండానే ఎంతోమందికి సహాయం చేసిన వాళ్లవుతారు. 


ఖాళీగా ఏం చేయాలో తెలియడం లేదా? అయితే మీ క్రియేటివి మొత్తం బయటకు తీయడానికి ఇంతకన్నా బెస్ట్‌ టైం దొరకదు. క్రాఫ్ట్స్‌లో అసలు సమయమే కనిపించదు. ఇంట్లోనే క్యాండిల్స్‌ చేయడం, ఇంటికి అవసరమైన వస్తువులను సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో గూగుల్‌లో వెతకండి. దీనివల్ల మీ టైంని కరెక్ట్‌గా ఉపయోగించుకున్నవాళ్లవుతారు. 


► బోర్‌ కొడుతుంది..కానీ బయటికి వెళ్లే మూడ్‌ లేదా? అయితే ఇంట్లోనే కూర్చొని నేషనల్‌ పార్క్‌లను ఓ లుక్కేయండి. మన దేశంలోనే ఎన్నో అందమైన పార్కులు ఉన్నాయి. NationalParks.org అనే వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే బోలెడన్నీ పార్కులు లైవ్‌గా ఇంట్లోనే చూసి ఆస్వాదించొచ్చు. వీటితో పాటు ఎన్నో పర్యాటక ప్రదేశాలను కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చొని వీక్షొంచొచ్చు.  


► మీకు బోర్‌ కొట్టినప్పుడు కాస్త పెరట్లోకి వెళ్లి ఓ హాయ్‌ చెప్పేసి రండి. అదేనండి మీ మొక్కలకు. గార్డెనింగ్‌లో మునిగిపోతే అసలు సమయమే కనిపించదు. కొత్త మొక్కలు నాటడం, ఉన్నవాటికి నీళ్లు పట్టడం, పాడైనవి తీసేయడం వంటివి చేయండి. రెగ్యులర్‌గా చేస్తూ ఇదొక రొటీన్‌లా మారిపోతుంది. 


► చాలా సమయాన్ని ఏం చేయాలో తెలియక వృథా చేస్తుంటాం. బోర్‌ కొట్టినప్పుడు అయినా అసలు భవిష్యత్తులో ఏం చేయాలి? ఇప్పటివరకు ఏం చేశాం, నెక్ట్స్‌ ఎలా ప్లాన్‌ చేసుకుంటే బావుంటుంది అనే విషయాలపై దృష్టి పెడితే మంచిది. కొత్త భాష నేర్చుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం, కొత్త లక్ష్యాలు ఏర్పరుచుకోవడం.. ఇలా మీ ఇంట్రెస్ట్‌కి తగ్గట్లు ఓ చార్ట్‌ ప్రిపేర్‌ చేసుకొని దానికి తగ్గట్లు మీ సమయాన్ని కేటాయిస్తే కొన్ని రోజుల్లోనే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement