ఆస్ట్రేలియాలో 'షెగెలోసిస్‌ వ్యాధి' కలకలం!వందలాది మందికిపైగా.. | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో 'షెగెలోసిస్‌ వ్యాధి' కలకలం!వందలాది మందికిపైగా..

Published Wed, Mar 20 2024 12:20 PM

Shigellosis Outbreak Hits Australian Music Festival - Sakshi

ఆస్ట్రేలియా షెగెలోసిస్‌ వ్యాధి(షిగెల్లా బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధి) తీవ్ర కలకలం రేపుతుంది. ఆస్ట్రేలియాలోని స్టేట్‌ విక్టోరియాలో ఎసోటెరిక్‌ మ్యూజిక్‌ ఫెస్టివల్‌ జరిగింది. దీనికి హాజరైన ప్రజలలో కొంతమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ ఫెస్టివల్‌ డోనాల్డ్‌లో మార్చి8 నుంచి మార్చి12వ తేది వరకు జరిగింది. ఆ ఫెస్టివల్‌కి హాజరైన వారిలో దాదాపు 230 మంది దాక షిగెలోసిస్‌కి సంబంధించిన జీర్ణశయాంతర పేగు సంబంధిత లక్షణాలను ఎదుర్కొన్నారు. దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు ఆ ఫెస్టివల్‌కి హజరైన వారలో ఇంకెవరికైనా అలాంటి లక్షణాలు తలెత్తితే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

ఈ వ్యాధి అతిసారం మాదిరిగా జ్వరం, వికారం, వాంతులు, పొత్తికడుపు తిమ్మిరి వంటి గ్యాస్ట్రో లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులే ఈ వ్యాధికి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఎక్కుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ఎక్కువ మందికి ఈ వ్యాధి వ్యాపించడంతో ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, సలహదారులు చెప్పేంత వరకు ఆయా బాధితలు ఎలాంటి విధులకు హాజరుకాకుడదని హెచ్చరించింది. యాంటీ బయాటిక్స్ మందులతో ఈ వ్యాధిని అదుపులోకి తీసుకురావొచ్చుగానీ కేసులు పెరిగితే మాత్రం ఈ వ్యాధి వ్యాప్తి సవాలుగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు ఆరోగ్యనిపుణులు.

ఏంటీ షెగెలోసిస్‌ వ్యాధి..

  • ఈ బ్యాక్టీరియా పేరు షింగెల్లా. ఇది సోకడాన్ని షింగెల్లోసిస్ అంటారు.
  • ఇది సోకితే విరేచనాలు (డయేరియా), జ్వరం, కడుపు నొప్పి వస్తాయి. ఇవి కొన్ని రోజులపాటూ ఉంటాయి. చికిత్సలో యాంటీబయోటిక్స్‌ని వాడుతారు. ఇవి వ్యాధి వ్యాప్తిని తగ్గించగలవు.
  • షింగెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి రకరకాల మార్గాల్లో వ్యాపించగలదు. ఆల్రెడీ సోకిన వ్యక్తికి డయేరియా తగ్గి నయం అయిపోయినా… ఆ వ్యక్తి నుంచి ఈ బ్యాక్టీరియా ఇతరులకు సోకగలదు.
  • అలాగే ఈ వ్యాధి కలుషిత ఆహారం లేదా లైంగిక సంబంధం ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ.
  • ముఖ్యంగా పారిశుద్ధ్యం సరిగా లేని ప్రాంతాల్లో నివసించడం లేదా ప్రయాణించడం, పురుషులతో శృంగారంలో పాల్గొనే పురుషులకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

నివారణ:

  • తరచుగా చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం.
  • మంచి పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు ఆహార  పరిశుభ్రతను పాటించాలి 
  • ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహాల మేరకు తీసుకోవాలి. 
  • ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట కేవలం పరిశుభ్రంగా ఉండటమే కీలకం

(చదవండి: ఇదేం వ్యాధి.. సోఫా ఫోమ్‌, ఫోటో ఫ్రేమ్‌ గ్లాస్‌లు తినేస్తోంది..)

Advertisement
Advertisement