కోట్లల్లో పెరిగిపోతున్న పెట్‌ డాగ్స్‌ ఇండస్ట్రీ.. | Sakshi
Sakshi News home page

కుక్కల కోసం లక్షల్లో ఖర్చు.. అయినా తగ్గేదేలే అంటున్న పెట్‌ పేరేంట్స్‌

Published Tue, Dec 26 2023 11:45 AM

Pet Population In India Is Likely To Touch 45 Million In The Next 5 Years - Sakshi

పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్‌ భారత్‌లో ఏటా 13.9% పెరుగుతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్‌లలో ఒకటని ఇండియన్ పెట్ ఇండస్ట్రీ జాయింట్ అడ్వైజరీ కౌన్సిల్ (IPICA) పేర్కొంది. దీనికి సంబంధించి జస్ట్ డాగ్స్ మార్కెటింగ్ హెడ్ కషాప్ సంఘాని మాట్లాడుతూ..గతంలో వెటర్నరీ క్లినిక్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పెట్ కేర్ మార్కెట్ విస్తృతంగా అభివృద్ది చెందుతుంది. ఐదేళ్ల క్రితం భారతదేశంలో దత్తత తీసుకున్న పెంపుడు జంతువుల సంఖ్య 28 మిలియన్లు ఇప్పుడు 38 మిలియన్లకు చేరుకుందని, వచ్చే ఐదేళ్లలో అదే సంఖ్య 45 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

పెంపుడు జంతువుల పరిశ్రమ మొత్తం రూ. 8000 కోట్లని, అందులో 65% భారతదేశంలో పెంపుడు జంతువుల ఆహారమని మార్కెట్ అని పేర్కొన్నారు. భారతీయ పెంపుడు జంతువుల పరిశ్రమ ప్రకారం.. పెంపుడు పిల్లల సంరక్షణ కోసం పెట్‌ పేరెంట్స్‌ చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత దత్తత తీసుకోవడం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం, పెంపుడు జంతువులను ఇంట్లో పిల్లలతో సమానంగా పరిగణిస్తున్నారు. వాటి సంరక్షణ కోసం ఎంత డబ్బైనా వెచ్చిస్తున్నారు. పెంపుడు జంతువుల కోసం నెలకు సగటున రూ. 5వేల నుంచి రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుంది.

వాటి ఆహారం, దుస్తులు, మందులు,బొమ్మలు.. ఇలా వాటి జాతి, వయస్సు, నగరాన్ని బట్టి ఖర్చు మారుతుంది. బడ్జెట్‌లో దాదాపు 70%-75% ఎక్కువగా పెట్స్‌ కోసం ఫుడ్‌, ట్రీట్‌మెంట్‌ కోసమే ఖర్చవుతుంది. పెంపుడు జంతువుల దత్తత పెరగడం ప్రధాన నగరాల్లో మాత్రమే కాదు. ఇది టైర్ 2 మరియు 3 నగరాలకు కూడా విస్తరించింది. దీంతో గత రెండేళ్లలో కొత్తగా 70 పెట్ కేర్ కంపెనీలు ఆవిర్భవించాయి. పెంపుడు కుక్కలలో 6% కుక్కలకు మాత్రమే బ్రాండెడ్ ఆహారం ఇస్తారు. మిగిలినవి దాదాపు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని మాత్రమే తింటాయి. 

ఇక పిల్లుల్లో  2% వాటికి మాత్రమే బ్రాండెడ్‌ ఆహారం తింటాయని డాగ్-ఓ-బో సహ వ్యవస్థాపకుడు ఇబాదత్ శర్మ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..15 ఏళ్ల క్రితం గ్రూమింగ్‌ సెలూన్‌లు లేవు. అప్పట్లో చైనా నుంచి కొన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పెట్ గ్రూమింగ్ సెలూన్లు చాలా ఉన్నాయి. అన్ని ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేస్తున్నారు. ఇప్పుడు పెట్‌ డాగ్స్‌ కోసం స్విమ్మింగ్ పూల్,ప్రత్యేక ఆహారం, డాగ్ ట్రైనర్‌లు, డాగ్ సిట్టర్‌లు, డాగ్ రిసార్ట్స్, డాగ్ గ్రూమింగ్ సెలూన్‌లు, నోబిల్ ట్రీట్‌మెంట్ వ్యాన్‌లు, పెట్ ఫుడ్ ఇలా ఎన్నో వచ్చేశాయి. అంతేకాకుండా ఇప్పుడు పెంపుడు జంతువులను రవాణా చేసే స్పెషల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెంట్లు ఉన్నాయి.

TRASNFERET మొబిలిటీ జనరల్ మేనేజర్ బిజు వర్గీస్ ప్రకారం.. గత ఎనిమిదేళ్లలో వారు దాదాపు 8500 పెంపుడు జంతువులను రవాణా చేసినట్లు తెలిపారు. పెట్ కేర్‌లో ముంబై, ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో త్వరలోనే సెవెన్ ఓక్స్ పెట్ అనే అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ పెట్ క్లినిక్‌ ఏర్పాటు చేయనున్నట్లు మేనేజింగ్ పార్టనర్ అర్చన నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికానికి ఇది రెడీగా ఉంటుందని ఆమె పేర్కొంది. హైదరాబాద్‌ను వెటర్నరీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారని అమెరికికు చెందిన ప్రముఖ వెటర్నరీ డాక్టర్‌ శ్రీరెడ్డి తెలిపారు. ఇందులో యానిమల్ బ్లడ్ బ్యాంక్, ఎలక్ట్రిక్ శ్మశానవాటిక వంటి అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement