ఈస్ట్రోజెన్ - అద్భుతమైన ఫుడ్స్‌ : ఈ డేంజర్‌ కూడా ఉంది! | Sakshi
Sakshi News home page

ఈస్ట్రోజెన్ - అద్భుతమైన ఫుడ్స్‌ : ఈ డేంజర్‌ కూడా ఉంది!

Published Sat, Mar 9 2024 1:27 PM

Estrogen levels check these foods to increase - Sakshi

#EstrogenandFood ఈస్ట్రోజెన్‌  మన శరీర పనితీరులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని జీవ క్రియలకు ఈస్ట్రోజన్‌ చాలా అవసరం. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం ఈస్ట్రోజన్‌‌ మహిళలలో నెలసరి, పునరుత్పత్తి వ్యవస్థ, లైంగిక కోరికను ప్రభావితం చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో,  కొల్లాజెన్‌ ఉత్పత్తిలో, ఎముకలు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ సాయ పడుతుంది. 

జీవితకాలంలో ఈస్ట్రోజెన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు సాధారణం అయితే, ఈ స్థాయిల్లో తీవ్ర అసమతుల్యత వస్తే మొత్తం ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితంచేస్తుంది. శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్‌ తగ్గితే నెలసరి క్రమం తప్పడం, వివాహిత మహిళల్లో గర్భాధారణ  లాంటి సమస్యలొస్తాయని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ హెచ్చరించింది.

ఈస్ట్రోజెన్  తగ్గితే ఏమవుతుంది. 
శరీరంలో తగినంత ఈస్ట్రోజెన్ లేకపోతేచాలా సమస్యలొస్తాయి. అలాగే మెనోపాజ్ సమయంలో , అండాశయాల శస్త్రచికిత్స తొలగింపు తర్వాత   ఈస్ట్రోజెన్  ఉత్పత్తి తగ్గి పోతుందని ఎండోక్రైన్ సొసైటీ  తెలిపింది.  వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, యోని పొడిబారడం, నిద్రలేమి , మైగ్రేన్‌  లాంటి సమస్యలు ఈస్ట్రోజెన్ తగ్గిందనడానికి సంకేతం. దీనికి సాధారణంగా  హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ తీసుకోవచ్చు. అయితే దీన్ని దీర్ఘకాలంకొనసాగించలేం. అందుకే ఈస్ట్రోజెన్ అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల సహజంగా ఈ స్థాయిలను పెంచుకోవచ్చు.

ఈస్ట్రోజెన్  లభించే ఆహారాలు
పాలు, గుడ్లు వంటి జంతు ఆధారిత ఉత్పత్తులు మన ఆహారంలో చేర్చుకుంటే ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి పెరుగుతంది.  అయితే ఈ ఆహారాలను మితంగా తీసుకోవడం మంచిది.
► అవిసె గింజలు ,  గోధుమ గింజలు, సోయాబీన్స్ ఉత్పత్తులు  తీసుకోవాలి.
► ఖర్జూరం, ప్రూనే, ఆప్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఫైటోఈస్ట్రోజెన్‌లు పుష్కలంగా ఉంటాయి. 
► ఈస్ట్రోజెన్-రిచ్ ఫుడ్స్ కోసం చూస్తున్నట్లయితే నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇతర ముఖ్యమైన పోషకాలతో పాటు ఫైటోఈస్ట్రోజెన్‌లలో కూడా లభ్యం.5 ఈస్ట్రోజెన్ లోపం కారణంగా ఎముకల సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి  బెస్ట్‌.
బ్రోకలీ , క్యాబేజీ, బచ్చలికూర వంటి  ఆకులు మందంగా ఉండే ముదురు రంగు ఆకుకూరలు
ప్రముఖ డైటీషియన్ డానా కాన్లీ ప్రకారం ఒమేగా-త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే అవిసె గింజల్లో   అత్యధిక ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్  ఉంది.
రాస్‌ బెర్రీస్, క్రాన్‌ బెర్రీస్, స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లతోపాటు,  ఫైటోఈస్ట్రోజెన్లు కూడా ఉన్నాయి.

నోట్‌: ఈస్ట్రోజెన్  లభించే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల  కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ 2017 అధ్యయనం ప్రకారం  ఈస్ట్రోజెన్‌ను ఎండోక్రైన్ డిస్‌రప్టర్‌గా పరిగణిస్తారు. ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల వంధ్యత్వం  ఈస్ట్రోజెన్-సెన్సిటివ్ అవయవాలలో కేన్సర్  ముఖ్యంగా రొమ్ము , గర్బాశయ, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
 

Advertisement
 
Advertisement
 
Advertisement