ప్రేమించిన అమ్మాయి దూరమవుతోందని... | Sakshi
Sakshi News home page

18 ఏళ్లు వచ్చాక పెళ్లి చేస్తామన్న తల్లిదండ్రులు.. ప్రేమించిన అమ్మాయి దూరమవుతోందని..

Published Tue, Nov 15 2022 2:49 PM

Man Committed Suicide Girl Moving Away After Falling Love - Sakshi

సికింద్రాబాద్‌: ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుందని భావించిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మహబుబాబాద్‌ వెల్లికుదురు మండలం వావిలాలకు చెందిన దారావత్‌ సంతోష్‌(17) ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తుంటాడు.

కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నానని, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. 18 ఏళ్లు వయస్సు నిండిన తరువాత పెళ్లి చేస్తామని సంతోష్‌కు వారి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. దీంతో సంతోష్‌ తీవ్ర మనస్తాపానికి గురై ఈ నెల 13న రాత్రి 10 గంటల సమయంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ హైదరాబాద్‌ ఎండ్‌ పిట్‌లైన్‌ వద్ద గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతుని జేబులో లభ్యమైన సెల్‌ఫోన్‌ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

(చదవండి: ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు)

Advertisement
 
Advertisement
 
Advertisement