ఐటీ ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ! మళ్లీ ఇంకో ప్రముఖ కంపెనీ.. | Tech Layoffs 2024: Salesforce To Sack 700 Workers, Says Report - Sakshi
Sakshi News home page

Salesforce Layoffs 2024: ఐటీ ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ! మళ్లీ ఇంకో ప్రముఖ కంపెనీ..

Published Fri, Jan 26 2024 5:15 PM

Salesforce to sack 700 workers says report - Sakshi

Tech layoffs 2024: ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులకు లేఆఫ్‌లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనూ ప్రముఖ కంపెనీలు ఒక దాని వెంట మరొకటి లేఆఫ్‌లను ప్రకటిస్తూనే ఉన్నాయి. 

యూఎస్‌కు చెందిన క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ దాదాపు 700 మంది ఉద్యోగులను తొలగిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. అమెజాన్, గూగుల్ వంటి టెక్‌ దిగ్గజాలు ప్రకటించిన లేఆఫ్‌లతో ఇప్పటికే అమెరికాలో తొలగింపుల తరంగం కొనసాగుతుండగా ఇందులో తాజాగా సేల్స్‌ఫోర్స్‌ చేరింది. 

సేల్స్‌ఫోర్స్ గత సంవత్సరం 10 శాతం ఉద్యోగాలను తగ్గించింది. కొన్ని కార్యాలయాలను మూసివేసింది. అయితే మార్జిన్‌లను పెంచడానికి 3,000 మందికి పైగా ఉద్యోగులను తీసుకుంటామని గడిచిన సెప్టెంబరులో కంపెనీ తెలిపింది.

వరుస లేఆఫ్‌లు
కొత్త ప్రారంభమైనప్పటి నుంచి టెక్‌ పరిశ్రమలో వరుస లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. Layoffs.fyi పోర్టల్ ప్రకారం.. 2024 ప్రారంభం నుంచి 85 టెక్ కంపెనీలు 23,770 మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ వారం మైక్రోసాఫ్ట్ తన గేమింగ్ డివిజన్ యాక్టివిజన్ బ్లిజార్డ్‌లో 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆన్‌లైన్ రిటైలర్ ఈబే దాదాపు 1,000 మంది ఉద్యోగుల  తొలగింపులను కూడా ప్రకటించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement