ఐకానిక్‌ డబుల్‌ డెక్కర్‌: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్‌ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే! | Sakshi
Sakshi News home page

ఐకానిక్‌ డబుల్‌ డెక్కర్‌: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్‌ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!

Published Sat, Sep 16 2023 1:37 PM

Double decker buses Anand Mahindra reports a theft Mumbai Police responds - Sakshi

ముంబై మహానగరంలో ఐకానిక్‌ రెడ్‌  డబుల్ డెక్కర్ బస్సులు ఇక కనిపించవు. ఈ డబుల్ డెక్కర్ బస్సుల స్థానంలో  రానున్న 9 నెలల్లో సిటీట్రాఫిక్ సిస్టమ్‌లో 900 ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తేనుంది. మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) కొత్త డబుల్ డెక్కర్లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ (బెస్ట్‌)  చివరి నడుస్తున్న  డబుల్ డెక్కర్ బస్సును స్వాధీనం చేసుకుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా ముంబై వాసులు భావోద్వేగంతో వీటికి వీడ్కోలు పలకడం వైరల్‌గా మారింది. దీనిపై పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన "అత్యంత ముఖ్యమైన చిన్ననాటి జ్ఞాపకాల" దొంగతనం చేశారంటూ ముంబై పోలీసుల అధికారిక ఎక్స్‌(ట్విటర్‌) ను ట్యాగ్‌ చేస్తూ ఒక పోస్ట్‌ పెట్టారు. (మరో గ్లోబల్‌ కంపెనీ సీఈవోగా భారతీయుడు కార్తీక్‌రావు)

“హలో, ముంబై పోలీస్.. నా చిన్ననాటి జ్ఞాపకాలలో ఒకదానిని దొంగిలించడాన్ని మీకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాను అంటూ ఒకింత భావోద్వేగంతో ట్వీట్‌ చేశారు. దీనికి ముంబై పోలీసులు  కూడా  స్పందించారు.  డిపార్ట్‌మెంట్ దొంగతనం గురించి స్పష్టంగా తెలుస్తోంది. కానీ  దానిని స్వాధీనం చేసుకోలేం అంటూ బదులిచ్చారు.  ఆనంద్ మహీంద్రా సర్ నుండి 'నోస్టాల్జిక్ హీస్ట్' నివేదికను అందుకున్నాం, కానీ  దానిని స్వాధీనం చేసుకోలేం ఆ B.E.S.T ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలు  మీతోపాటు  ముంబైవాసులందరి హృదయాల్లో భద్రంగా ఉన్నాయి అంటూ ట్వీట్‌ చేశారు. దీనికి ఆనంద్‌ మహీంద్ర మీరు చాలా డిఫరెంట్‌ అంటూ వారిని అభినందిస్తూ తిరిగి ట్వీట్‌ నెటిజనులను ఆకట్టుకుంటోంది.  (బాలీవుడ్‌లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్‌)

కాగా 1997లో86 ఏళ్ల  క్రితం  నగర వీధుల్లో ప్రవేశపెట్టారు. వీటి ప్లేస్‌లో మెరిసే రెడ్ అండ్ బ్లాక్ బ్యాటరీ-ఆపరేటెడ్ (EV) డబుల్ డెక్కర్లు  రోడ్డెక్కాయి. రెడ్ డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్ల యుగం సెప్టెంబర్ 15, శుక్రవారంతో ముగిపోయిన నేపథ్యంలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులకు వందలాది మంది ముంబైకర్లు వీడ్కోలు పలికారు. పూల దండలు, బెలూన్‌లతో అలంకరించి మరీ చివరిగా డీజిల్‌తో నడిచే డబుల్ డెక్కర్లకు బై బై చెప్పారు. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

Advertisement
Advertisement