AP: పేదరికంపై గెలుపు.. మెరుగుపడ్డ ప్రజల జీవన ప్రమాణాలు | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: పేదరికంపై గెలుపు

Published Mon, Jan 29 2024 4:14 AM

Improved living standards of people by Andhra Pradesh Govt Schemes - Sakshi

ఉండటానికి ఇల్లు.. తినటానికి తిండి.. కట్టుకోవటానికి బట్ట... ఈ మూడూ లేక ఇబ్బందులు పడేవారే పేదలన్నది ఒకప్పటి ప్రాతిపదిక. కానీ రోజులు మారాయి. ఈ మూడూ ఉండటమే కాదు... అవి నాణ్యంగా ఉండాలి. నిరంతరం కొనసాగాలి. అలా కొనసాగించటానికి అవసరమైన సదుపాయాలు వారికి అందుబాటులోకి రావాలి. అదిగో...  అప్పుడే వారు పేదరికం నుంచి బయటపడినట్లు.  

స్థూలంగా చెప్పాలంటే వీటన్నిటినీ సాధించడానికి పేదల ఆదాయాలు పెరగాలి. అలా పెరగటంతో పాటు... భవిష్యత్తుపై భరోసా ఉండేలా వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందాలి. గృహ వసతితో పాటు తాగునీరు, పౌష్టికాహారం అందటం.. మాతా శిశు మరణాలు తగ్గటం... ఇవన్నీ జరిగితేనే పేదరికం తగ్గినట్లని నీతి ఆయోగ్‌ స్పష్టంచేసింది. నాణ్యమైన విద్య, వైద్యం అందితే పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని పేర్కొంది. 

విశేషమేమిటంటే... నవరత్నాలతో పేదలకు అండగా నిలిచి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.4.21 లక్షల కోట్లను పేదలకు అందజేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ విషయంలో గణనీయమైన పురోగతి సాధించింది. ఇక్కడ పేదలు గడిచిన నాలుగున్నరేళ్లలో ఏకంగా 1.87 శాతం తగ్గారు. పేదరికం ఇప్పుడు 4.19 శాతానికి మాత్రమే పరిమితమయింది. ఇదీ... కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్‌ నివేదికలో వెల్లడించిన వాస్తవం. ఇదీ... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన మార్పు. 

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తొమ్మిది పథకాల ద్వారా జాతీయ స్థాయిలో 2019–21లో 14.96 శాతంగా ఉన్న పేదరికాన్ని 2022–23 నాటికి 11.28 శాతానికి తగ్గించిందని నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మాత్రం నవరత్నాలతో 2019–21లో 6.06 శాతంగా ఉన్న పేదరికాన్ని 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గించిందని కూడా తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో వైఎస్‌.జగన్‌ సర్కారు డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా పేదలకు రూ.4.21 లక్షల కోట్లను సాయంగా అందించటంతో ఎక్కడికక్కడ మహిళలు సైతం తమ కాళ్లపై నిలబడి సొంత వ్యాపారాలు చేసుకోవటం... ప్రతి ఒక్కరూ పిల్లల్ని స్కూళ్లకు పంపించటంతో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌రేíÙయో ఏకంగా 100 శాతానికి చేరటం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా పేదల సంఖ్య వేగంగా తగ్గుతోందని నివేదిక వివరించింది. 2015–16 సంవత్సరం, 2019–21 సంవత్సరం, 2022–23 సంవత్సరాల్లో దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ పేదరికం ఎలా తగ్గుతూ వస్తోందనే విషయాన్ని నీతి ఆయోగ్‌ ఈ నివేదికలో వెల్లడించింది.

పౌష్టికాహారం అందుతోందా? శిశు మరణాల రేటు ఎలా ఉంది? తల్లుల ఆరోగ్యం మెరుగుపడిందా? పాఠశాలలకు పిల్లల హాజరు శాతం ఎంత? వంటకు ఏ రకమైన ఇంధనం వినియోగిస్తున్నారు? పరిశుభ్రత పరిస్థితులు, తాగునీరు, గృహవసతి, విద్యుత్‌ వినియోగం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలకు చెందిన బహుముఖ సూచికల ఆధారంగా పేదరికం శాతాన్ని నీతి ఆయోగ్‌ లెక్కగట్టింది. రాష్ట్ర ప్రభు­త్వం సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందించటం, పారిశు­ద్ధ్యంతో పాటు ఉచిత విద్య, ఆరోగ్యం, పోషకాహారాలపై తీసుకుంటున్న చర్యలు కారణంగా పేదరికం శాతం గణనీయంగా తగ్గిందని నివేదికలో వివ­రించింది. ప్రజల జీవన నాణ్యతలో గణనీయమైన మెరుగుదల ఉందని నివేదిక స్పష్టంగా పేర్కొంది.  
నిబద్ధతతో వేగంగా అడుగులు... 
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధిస్తోంది. దీంతో పేదరికం శాతం కూడా అదే స్థాయిలో తగ్గుతోంది. వైఎస్సార్‌ చేయూత,  వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ ద్వారా వడ్డీ భారం లేకుండా రుణాలు అందజేయటం... ఇలా పలు కార్యక్రమాలు చేపడుతూ వరుసగా నాలుగేళ్ల పాటు ఫోకస్డ్‌గా పేద అక్క చెల్లెమ్మల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. అంతే కాకుండా నవరత్నాల్లో ప్రతి పథకాన్నీ పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకు రావటానికే అన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంది.

పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపడాన్ని ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తూనే... ఆ స్కూళ్లలో కార్పొరేట్‌ స్కూళ్లకు తీసిపోని నాణ్యమైన విద్యను అందించటానికి వేల కోట్ల రూపాయల్ని ఖర్చుచేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. చదువు చెప్పే తీరును, చదువుకునే పద్ధతిని ఆధునిక స్థాయిలకు తీసుకెళ్లి సమూలంగా మార్చింది. అలాగే మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాలను రూపుమాపేందుకు సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమాలను, స్కూళ్లలో జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తోంది. ఇక వైద్య సేవల విషయంలో ఈ రాష్ట్రంలో పేదలకున్న భరోసా మరెక్కడా లేదనే చెప్పాలి.

పేద, మధ్యతరగతి ప్రజలకు వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవల్ని ఏకంగా రూ.25 లక్షల పరిమితి వరకూ అందిస్తోంది. వీటన్నిటితో పాటు నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు పథ­కం కింద 31.91 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు వాటిలో పక్కా ఇళ్ల నిర్మాణాలనూ చేపట్టింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సామా­జిక రంగానికి పెద్ద పీట వేస్తూ అత్యధికంగా వ్యయం చేస్తుండటంతో రాష్ట్రంలో పేదల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది.

‘ఆసరా’ సంకల్పం సాకారమైన వేళ..
ఒక మహిళ ఆర్థికంగా నిలదొక్కుకుంటే... కుటుంబం బాగుపడుతుంది. ఒక కుటుంబ పరిస్థితి మెరుగు­పడితే... ఊరు అభివృద్ధి చెందుతుంది. ఊళ్లన్నీ పురోగమిస్తే రాష్ట్రం ఉన్నత స్థాయికి ఎదుగు­తుంది. ఇదే సిద్ధాంతాన్ని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు ఆసరా కల్పించేందుకు సంకల్పించారు. 2014 ఏప్రిల్‌ 11వ తేదీనాటికి బ్యాంకుకు బకాయిపడిన మొత్తాన్ని వారు సక్రమంగా చెల్లిస్తే నాలుగు విడతల్లో వైఎస్సార్‌ ఆసరా కింద వాపసు చేస్తానని హామీ ఇచ్చారు. దానిని తూచా తప్పకుండా పాటించారు.

ఆయన ఆలోచన నిజమైంది. ఆయన సంకల్పం సాకారమైంది. ఇప్పుడు ఆసరా అందించిన తోడ్పాటుతో ఎంతగానో ఎదుగుతున్నారు. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన లక్ష్మీదేవి పాడి­పశువుల పెంపకం చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు కమలమ్మ ఓ ఇంటినే కొను­గోలు చేశారు. ఏలూరు జిల్లాకు చెందిన సుంకరబుజ్జమ్మ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. ఇలాంటి విజయగాథలు చాలవా... జగనన్న సంకల్పం ఎంతగొప్పదో­?
–  సాక్షి, నెట్‌వర్క్‌ 

పాడి వ్యాపారంతో కుటుంబానికి బాసట
మాది వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరు. నేను శివ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలిని. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ఆసరా పథకం కింద అందిస్తున్న డ్వాక్రా రుణమాఫీ సొమ్మును పాడి పశువుల పెంపకానికి వినియోగిస్తున్నాను. ఇప్పటి­వరకూ ఏడాదికి రూ.18,750లు వంతున మొత్తం రూ.75వేలు వచ్చింది. ఆ సొమ్ముతో పాడిపశువులు కొని పాల వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు నేను కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాను. ప్రభుత్వానికి రుణపడి ఉంటాను.
– లక్ష్మీదేవి, ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు, ముద్దనూరు వైఎస్సార్‌ జిల్లా

ఇల్లు కొనుగోలుకు సాయపడింది
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని దోర్నాదులవారి వీధికి చెందిన ఈమె పేరు గూడూరు కమలమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పొదుపు గ్రూపులో సభ్యు­రా­లైన ఈమెకు వైఎస్సార్‌ఆసరా పథకం కింద ఏడాదికి రూ.16,780 వేల చొప్పున ఇప్పటి­వరకూ రూ.67,120 నగదు ఆమె వ్యక్తిగత ఖాతాలో జమ­యింది. ఆ మొత్తంతో తాము అద్దెకు ఉంటున్న ఇంటినే కొనుగోలు చేయగలిగామనీ, పిండిమర ఇంట్లో ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారం చేసుకుంటున్నామని తెలిపారు. కేవలం సీఎం జగన్‌ వల్లే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైంది.
– గూడూరు కమలమ్మ, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా 

కూరగాయల వ్యాపారానికి ఆధారం 
ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన ఈమె పేరు సుంకర బుజ్జమ్మ. వనిత గ్రూపు సభ్యురాలైన ఈమె భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ముగ్గురు పిల్లల పోషణభారం ఈమెపై పడింది. వైఎస్సార్‌ ఆసరా పథకం కింద ఏడాదికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేలు రాగా ఆ మొత్తంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించారు. దీనికి మరో రూ.2 లక్షల రుణంతో వ్యాపారం విస్తరించారు. ఇప్పుడు పిల్లలను గౌరవంగా చదివించగ­లు­­గుతు­న్నా­­­­నన్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
– సుంకర బుజ్జమ్మ, మండవల్లి, ఏలూరు జిల్లా

బిడ్డల చదువుకు తోడ్పడుతున్నా...
ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకం ద్వా­రా నాలుగేళ్లలో రూ.60 వేలు వచ్చాయి. వీటితో చిల్లరకొట్టు, కూరగా­యల వ్యాపారం చేస్తున్నా. వచ్చిన ఆదా­యంతో మా పాప ఇంజినీ­రింగ్, మా బాబును సివిల్స్‌ కోచింగ్‌కు పంపాం. వారిద్దరికీ ఫీజు రీయింబర్స్‌­మెంట్, వసతి దీవెన వచ్చాయి. సీఎం జగనన్న సాయంతోనే మా కుటుంబం ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకుంది.
– మిర్యాల ఉషారాణి, ఈలప్రోలు, ఎన్టీఆర్‌ జిల్లా 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement