Road Accident in Kurnool: Bus Ran into Flyover Railing - Sakshi
Sakshi News home page

తప్పిన ప్రమాదం.. రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు

Published Thu, Sep 2 2021 5:29 PM

Bus Hangs From Railing In Kurnool - Sakshi

కర్నూలు: కర్నూలు జిల్లా డోన్‌ పట్టణంలో తృటిలో బస్సు ప్రమాదం  తప్పింది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు ఫ్లైఓవర్‌ మీదుగా ప్రయాణిస్తున్న క్రమంలో అదుపుతప్పి.. రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత డ్రైవర్‌ బ్రేకులు వేయడంతో బస్సు గాలిలో వేలాడుతూ ఆగిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. కాగా, పోలీసులు ట్రాఫిక్‌ను అదుపు చేస్తున్నారు. 

బస్సు కింద పడుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించేదని అధికారులు తెలిపారు. అనంతపురం నుంచి కర్నూలుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

చదవండి: 'నా చావుకు బాకీలోల్లే కారణం'.. సెల్ఫీ వీడియో 

Advertisement
 
Advertisement
 
Advertisement