మూడంచెల భద్రతతో ప్రశాంతంగా పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

మూడంచెల భద్రతతో ప్రశాంతంగా పోలింగ్‌

Published Tue, May 14 2024 10:15 AM

మూడంచెల భద్రతతో ప్రశాంతంగా పోలింగ్‌

ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌టౌన్‌: జిల్లాలో పార్లమెంట్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రత్యేక యాక్షన్‌ ప్లాన్‌, పోలింగ్‌ కేంద్రాల చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ జానకీషర్మిల తెలిపారు. జిల్లాలోని పలు పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ సోమవారం పరిశీలంచారు. పోలీస్‌ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాతంగా జరిగినట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద కేంద్ర బలగా లతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జి ల్లా స్పెషల్‌ పార్టీ, సెంట్రల్‌ అర్మడ్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌తో గస్తీ నిర్వహించామన్నారు. ఈవీఎంల తరలింపునకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గొడవలు జరిగితే ప్రతిఘటించేలా క్విక్‌ రియాక్షన్‌ టీం ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసులు ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. సమన్వయంతో పనిచేసి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేలా పనిచేశారని అభినందించారు. ఎస్పీ వెంట నిర్మల్‌ డీఎస్పీ గంగారెడ్డి, పట్టణ, రూరల్‌ సీఐలు అనిల్‌, నవీన్‌ ఉన్నారు.

ఖానాపూర్‌/సోన్‌: ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా ఎస్పీ జానకీషర్మిల జిల్లాలోని పలు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ఖానాపూర్‌ మండలం గోసంపల్లె, రాజురా, అడవి సారంగాపూర్‌ గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. సోన్‌ మండలం సోన్‌, న్యూవెల్మల్‌ గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలు తనిఖీ చేశారు. ఆమె వెంట సీఐలు సైదా రావు, నవీన్‌కుమార్‌, ఎస్సై రవీందర్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement