No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, May 14 2024 10:10 AM

No Headline

కపిలేశ్వరపురం: సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి. ప్రభుత్వ యంత్రాంగమంతా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు సన్నద్ధమయ్యారు. 2009లో ఏర్పాటైన మండపేట నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గంలోని ఎన్నికల తీరు మండపేట పట్టణం, రూరల్‌ మండలంలోని 12 గ్రామాలు, కపిలేశ్వరపురం మండలంలోని 19 గ్రామాలు, రాయవరం మండలంలోని 12 మొత్తం 43 గ్రామాల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ఆధారపడి సాగుతోంది. 2014 , 2019, ప్రస్తుత ఎన్నికల తీరుపై ఈ కథనం..

ఎన్నికల బరిలో ఉన్నవారు..

2014, 2019, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఆ మూడు ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, కాంగ్రెస్‌ నుంచి కామన ప్రభాకరరావు, స్వతంత్ర అభ్యర్థిగా కోన సూర్యభాస్కరరావు, మార్ని సత్యనారాయణ వరుసగా పోటీలో ఉన్నారు. మందపల్లి రవి 2019లోనూ, ప్రస్తుత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ తరపున 2014లో గిరిజాల వెంకటస్వామి నాయుడు, 2019లో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ప్రస్తుతం తోట త్రిమూర్తులు పోటీలో ఉన్నారు. బీఎస్పీ తరపున 2014లో ఎంవీ సుబ్బరాజు, ప్రస్తుత ఎన్నికల్లో గుర్రపు కొత్తియ్య పోటీలో ఉన్నారు. పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున 2014లో మొగ్గా భారతి, 2019లో నల్లమిల్లి విజయభాస్కరరెడ్డి పోటీ చేశారు. జనసేన తరపున 2019లో వేగుళ్ల లీలాకృష్ణ, 2019లో బీజేపీ తరపున కోన సత్యనారాయణ, 2014లో జేఎస్‌పీ తరపున సినీనటి సయ్యద్‌ హేమ పోటీలో ఉన్నారు. లోక్‌ సత్తా తరపున 2014లో పీవీవీ రామకృష్ణ, 2014లో ఐసీఎస్‌పీ తరపున మందపల్లి సత్యానందం, ప్రస్తుత ఎన్నికల్లో నవతరం పార్టీ తరపున నందికోళ్ళ రాజు, ఆర్‌పీఐఏ తరపున సాదే డేవిడ్‌రాజు, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున నల్లా చిన్నారావు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా 2019లో గుత్తుల శ్రీనివాస్‌, దాసి ఈశ్వరరావు పోటీ చేయగా ప్రస్తుత ఎన్నికల్లో రాయుడు శ్రీనివాస్‌, కోన వీరవెంకట సత్యనారాయణ, కోన శ్రీకృష్ణలు పోటీలో ఉన్నారు.

గత మూడు ఎన్నికల్లో

11 తగ్గని అభ్యర్థుల సంఖ్య

ఆసక్తి చూపుతున్న స్వతంత్య్ర అభ్యర్థులు

ప్రస్తుత ఎన్నికల బరిలో రాజకీయ పార్టీల నుంచి ఏడుగురు, స్వతంత్ర అభ్యర్థులు ఆరుగురు

Advertisement
 
Advertisement
 
Advertisement