Lok Sabha Election 2024: ఓటేస్తే ఉచిత బైక్‌ రైడ్‌ | Sakshi
Sakshi News home page

Lok Sabha Election 2024: ఓటేస్తే ఉచిత బైక్‌ రైడ్‌

Published Tue, May 14 2024 5:03 AM

Lok Sabha Election 2024: Rapido to provide free ride from polling booth to the voters residence on May 25

అవును! పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లి ఓటేసి.. తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు ర్యాపిడో బుక్‌  చేసుకుంటే చాలు. ఉచితంగా ఇంటికి తీసుకెళ్లి దింపేస్తారు. ఓహో సూపరని ఆనందిస్తున్నారా? అయితే ఈ ఆఫర్‌ మన రాష్ట్రంలో కాదు. దేశ రాజధాని ఢిల్లీలో. అక్కడ ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి ప్రభుత్వంతోపాటు ప్రైవేట్‌ సంస్థలు పాటుపడుతున్నాయి. ర్యాపిడో ఈ ప్రక్రియలో భాగస్వామ్యమైంది. 

ఓటర్లు ఓటేసిన అనంతరం పోలింగ్‌ బూత్‌ల నుంచి ఇంటికి చేరుకునేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కలి్పంచింది. ఢిల్లీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ బైక్‌ టాక్సీ కంపెనీతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మే 25న ఢిల్లీ లోక్‌సభ పోలింగ్‌ రోజున జరగనుంది. ఆ రోజు ఓటేసిన అనంతరం ప్రయాణికులు బైక్‌ బుక్‌ చేసుకుని ఉచితంగా ప్రయాణించవచ్చు. ఢిల్లీలో 80 లక్షల మంది ర్యాపిడో సబ్‌స్క్రైబర్లు ఉండగా.. ఆ సంస్థకు ఎనిమిది లక్షల మంది బైక్‌ డ్రైవర్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement