-
అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు
న్యూఢిల్లీ: భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అట్టారీ-వాఘా సరిహద్దుల్లో ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్, పాకిస్థాన్ సైనికులు కవాతు చేశారు. ఇరు దేశాల సైనికులు ఉత్సాహంగా పరస్పరం కరచాలనం చేసుకోవడం ఆకట్టుకుంది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న అట్టారీ సరిహద్దులో జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఇరు దేశాల పౌరులు హాజరయ్యారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో పాక్ రేంజర్లు, బీఎస్ఎఫ్ జవాన్లు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. 1959 నుంచి ప్రతి ఏటా ఇరు దేశాల సైనికులు ఈ బీటింగ్ రీట్రీట్ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పలు నృత్య ప్రదర్శనలు, గీతాలపనలు నిర్వహించారు. ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: అప్పుడు తులం బంగారం విలువ 88 రూపాయల 62 పైసలు! ఈ విషయాలు తెలుసా? -
తీరిన కోరిక: పాకిస్తాన్ వెళ్లాలి మా ఇల్లు చూడాలి
15 ఏళ్ల వయసులో దేశ విభజన సమయంలో రావిల్పిండిని వదిలి వచ్చేసింది రీనా వర్మ కుటుంబం. అప్పటి నుంచి పాకిస్తాన్ వెళ్లి తన ఇంటిని చూసుకోవాలని బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని ఆమె కోరిక. ఎన్ని దశాబ్దాలు ప్రయత్నించినా వీసా ఇవ్వలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసు ఆమెకు. వీసా వచ్చింది. 75 ఏళ్ల తర్వాత వాఘా సరిహద్దును దాటి పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. ఆమె ఉద్వేగాలు ఎలా ఉంటాయో. ఎవరికైనా ఇది ఎంత గొప్ప అనుభవమో. గత సంవత్సరమే హిందీలో ఒక సినిమా వచ్చింది. నీనా గుప్తా లీడ్ రోల్. సినిమా పేరు ‘సర్దార్ కా గ్రాండ్సన్’. ఇందులో అమృత్‌సర్‌లోని 90 ఏళ్లు దాటిన ఓ వృద్ధురాలు లాహోర్‌లో ఉన్న తన ఇంటిని చూడాలనుకుంటుంది. దేశ విభజన సమయంలో అల్లర్లకు భర్త చనిపోగా నెలల బిడ్డను తీసుకొని సైకిల్ తొక్కుకుంటూ లాహోర్ విడిచిపెట్టి భారత్‌కు చేరుకుంటుందామె. మళ్లీ పాకిస్తాన్ వెళ్లడం కుదరదు. తన ఇంటితో ముడిపడ్డ జ్ఞాపకాలను తలచుకోని రోజు ఉండదు. పోయే ముందు ఆ ఇంటిని చూసి పోవాలని ఆమె కోరిక. కాని ప్రయాణం చేసే శక్తి ఉండదు. ఆమె బాధను మనవడు అర్థం చేసుకుంటాడు. ఆమె పాకిస్తాన్ వెళ్లకపోతే ఏమి ఆమె ఉన్న ఇంటినే ఇక్కడకు తెస్తాను అని పాకిస్తాన్ వెళ్లి ఆ ఇంటికి చక్రాలు కట్టి (బిల్డింగ్ మూవర్స్ సహాయంతో) తెచ్చి ఆమెకు చూపిస్తాడు. ఇది కొంచెం కష్టసాధ్యమైనా సినిమాలో ఎమోషన్ పండింది. అయితే రీనా వర్మ విషయంలో ఇంత ప్రయాస లేదు. అదృష్టవశాత్తు ఆమెకు పాకిస్తాన్ హైకమిషన్ వీసా ఇచ్చింది. కాకపోతే 1965 నుంచి ట్రై చేస్తుంటే 2022కు. మొన్న శనివారం (జూలై 16) వాఘా సరిహద్దు దాటి ఆమె పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. 15 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌ను వదిలాక ఇన్నేళ్ల తర్వాత తన ఇంటిని చూసుకోవడానికి అక్కడకు వెళ్లింది రీనా వర్మ. రావల్పిండిలో బాల్యం పూణెలో నివసిస్తున్న 90 ఏళ్ల రీనా వర్మ పాకిస్తాన్‌లోని రావల్పిండిలో పుట్టి పెరిగింది. అక్కడి ‘ప్రేమ్‌నివాస్’ అనే ఏరియాలో ఆమె బాల్యం గడిచింది. ‘మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసేవాడు. నాకు నలుగురు తోబుట్టువులు. నేను అక్కడి మోడర్న్ స్కూల్లో చదువుకున్నాను. మా నాన్న ఆ రోజుల్లోనే చాలా ప్రోగ్రెసివ్. ఆడపిల్లలను చదివించాలనుకున్నాడు. మా పెద్దక్క 1930లలోనే కాలేజీలో చదివింది. రావల్పిండి శివార్లలో మూరీ అనే హిల్ స్టేషన్ ఉంది. కొన్నాళ్లు అక్కడ మా నాన్న పని చేశాడు. అక్కడంతా బ్రిటిష్ వాళ్లు ఉండేవాళ్లు. వాళ్లతో మేము కలిసి మెలిసి ఉన్నాం’ అని చెప్పింది రీనా వర్మ. ఆమె అసలు పేరు రీనా చిబ్బర్. పెళ్లయ్యాక రీనా వర్మ అయ్యింది. దేశ విభజన 1932లో పుట్టిన రీనా వర్మకు దేశ విభజన నాటికి 15 ఏళ్లు. ‘దేశ విభజన వరకూ మాకు మత కలహాలు అంటే తెలియదు. మా ఇంటికి ముస్లింలు, శిక్కులు వచ్చి పోతుండేవారు. అందరూ స్నేహంగా ఉండేవాళ్లు. కాని దేశ విభజన సమయానికి అల్లర్లు పెరిగిపోయాయి. మా అమ్మ అసలు దేశం విడిపోతుందంటే నమ్మలేదు. కాని మేము ఢిల్లీ వచ్చేశాం’ అంది రీనా వర్మ. ‘ఢిల్లీ వచ్చాక ఆమె తొలి రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడం నాకొక గొప్ప అనుభూతి. అప్పుడు నెహ్రూగారిని చూశాను. మళ్లీ 1962 ఇండో చైనా యుద్ధం తర్వాత జరిగిన రిపబ్లిక్ డేలో లతా మంగేష్కర్ ‘ఏ మేరే వతన్ కే లోగో’ పాడుతున్నప్పుడు నేను నెహ్రూ గారి వెనుకనే కూచుని ఉన్నాను. ఆయన కన్నీరు కార్చడం నేను చూశాను’ అంటుంది రీనా. పెళ్లి తర్వాత ఆమె బెంగళూరు వచ్చి కావేరీ ఎంపోరియమ్‌లో పని చేయడం మొదలెట్టింది. భర్త హెచ్.ఏ.ఎల్ (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్)లో చేసేవాడు. కాని ఎక్కడ ఉన్నా ఆమెకు ఒక్కసారి తిరిగి రావల్పిండి చూసి రావాలనే కోరిక వేధించేది. 1965 నుంచి ప్రయత్నిస్తే... 1965లో పాకిస్తాన్ వీసా కోసం ప్రయత్నిస్తే రాలేదు. కాని మధ్యలో క్రికెట్ మేచ్‌ల కోసం వీసాలు ఇస్తున్నారంటే 1990లో లాహోర్‌కు వెళ్లింది కాని రావల్పిండికి వెళ్లలేకపోయింది. 2021లో ఆమె తన ఫేస్బుక్లో రావల్పిండి గురించి రాస్తే పాకిస్తాన్‌కు చెందిన సజ్జద్ హైదర్ అనే వ్యక్తి రావల్పిండిలోని ఆమె ఇంటి ఫొటో తీసి పంపాడు. అది చూసినప్పటి నుంచి ఆమెకు ఇంకా ఆ ఇల్లు చూడాలనే కోరిక పుట్టింది. మళ్లీ వీసా కోసం అప్లై చేస్తే రాలేదు. ఇంకోసారి వీసాకు అప్లై చేసి ఆ విషయాన్ని ఫేస్బుక్లో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీకి ట్యాగ్ చేయడంతో 90 ఏళ్ల రీనా వర్మ కోరికను మన్నించాల్సిందిగా ఆమె ఆదేశాలు ఇచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఆమెకు వెంటనే మూడు నెలల వీసా మంజూరు చేసింది. వాఘా సరిహద్దు గుండా ఆమె రోడ్డు మార్గంలో పాకిస్తాన్లో అడుగుపెట్టింది. మాలాంటి వాళ్ల కోసం నిజానికి భారత్, పాకిస్తాన్ల మధ్య 60 ఏళ్లు దాటిన వారి కోసం సరిహద్దుల్లో తక్షణ వీసాలు ఇచ్చే ఒప్పందం ఉంది. కాని దానిని పాటించడం లేదు. ‘విడిపోకుండా ఉంటే బాగుండేది. సరే విడిపోయాం. కాని మాలాంటి వాళ్ల కోసం ఇరుదేశాలు వీసాలు ఇస్తే కొన్ని పాత జ్ఞాపకాలను సజీవం చేసుకుంటాం’ అంటుంది రీనా వర్మ. ఈ కథనం అంతా వాఘా దాటిన వెంటనే రాస్తున్నది. ఆమె అక్కడ ఏం చూసిందో ఏం చేసిందో మరో కథనంలో చెప్పుకుందాం. ఒక మంచి తలంపును గట్టిగా తలిస్తే నెరవేరుతుంది అనడానికి రీనా వర్మ ఒక ఉదాహరణ. -
హైదరాబాద్ పోలీసుల చొరవతో ఎట్టకేలకు నగరానికి..
-
పాకిస్తాన్లో ఇరుక్కున్న తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదల
-
పాకిస్తాన్లో ఇరుక్కున్న తెలుగు యువకుడు విడుదల
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్లో చిక్కుకుపోయిన తెలుగు యువకుడు ప్రశాంత్ విడుదలయ్యాడు. అతను సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. 2017 ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి ప్రశాంత్ అదృశ్యమయ్యాడు. తన ప్రియురాలి కోసం పాకిస్తాన్ మీదుగా స్విట్జర్లాండ్ వెళ్లే క్రమంలో ప్రశాంత్ పాక్ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో ఇంత కాలం ప్రశాంత్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడు. తాజాగా వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ఆ యువకుడిని భారత్‌కు అప్పగించారు. ప్రశాంత్ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేశాడు. 2019లో తన కొడుకును రప్పించే ప్రయత్నం చేయాలని ప్రశాంత్ తండ్రి బాబూరావు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రశాంత్ విడుదలతో అతని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాక్ నుంచి ప్రశాంత్ తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉందని అతని సోదరుడు శ్రీకాంత్ తెలిపాడు. ప్రశాంత్ తిరిగి వచ్చేందుకు నాలుగేళ్లుగా పోలీసుల కృషి ఎంతో ఉందని గుర్తుచేశాడు. ప్రశాంత్ తిరిగి వచ్చేందుకు మీడియా పాత్ర కూడా ఎంతో ఉందని తెలిపాడు. చదవండి: ఎంత చెప్పిన వినరే.. ఏం.. తమాషా చేస్తున్నారా..?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement