-
గృహ రుణ గ్రహీతలకు ఎస్బీఐ బొనాంజా
ముంబై: గృహ రుణ మార్కెట్లో భారీ వాటా దక్కించుకోవడంలో భాగంగా బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణ రేటు తగ్గింపు సహా రుణ గ్రహీతలకు పలు ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు ఎస్బీఐ విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► అత్యధిక క్రెడిట్ స్కోర్ ఉంటే రుణ మొత్తంతో ఎటువంటి సంబంధం లేకుండా 6.70 శాతం నుంచి రుణ లభ్యత ఉంటుంది. ఇప్పటి వరకూ రూ.75 లక్షలు పైబడిన రుణాలనికి ఒక కస్టమర్ 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉండేది. దీని ప్రకారం, చక్కటి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి 45 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మేర వడ్డీరేటు తగ్గింది. 30 సంవత్సరాలకు చెల్లించే విధంగా రూ.75 లక్షల రుణం తీసుకుంటే, ఈ కాలపరిమితిలో రూ.8 లక్షలకుపైగా వడ్డీ భారాన్ని తగ్గించుకోగలుగుతారు. ► ప్రస్తుతం వడ్డీరేటు వేతన జీవులతో పోల్చితే, ఎటువంటి వేతనం పొందనివారు 15 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి. వీరి మధ్య రుణ రేటు వ్యత్యాసాన్ని ఎస్బీఐ తొలగించింది. ► రుణ బ్యాలన్స్ బదలాయింపుల విషయంలోనూ 6.70 శాతం వడ్డీరేటు అమలవుతుంది. ► ప్రాసెసింగ్ ఫీజునూ బ్యాంకింగ్ దిగ్గజం రద్దు చేసింది. రిటైల్ రుణాలపై బీఓబీ ఆఫర్లు మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కూడా పండుగల సీజన్‌ను పురస్కరించుకుని రిటైల్ రుణాలపై పలు ఆఫర్లను ప్రకటించింది. బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కార్ రుణ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గాయి. కారు రుణ రేటు 7 శాతం వద్ద ప్రారంభమైతే, గృహ రుణ రేటు 6.75 శాతం వద్ద ప్రారంభమవుతుంది. గృహ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును బ్యాంక్ తగ్గించింది. బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌పై కూడా రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. -
తక్కువ వడ్డీతో హౌసింగ్ లోన్లు
► వ్యవసాయదారులకు రూపే డెబిట్ కార్డులు ► ఫిక్స్డ్ డిపాజిట్లకు రూ.8.85 శాతం వడ్డీ సౌకర్యం ► నిబంధనలు లేకుండా రూ.10 లక్షల వరకు ముద్ర రుణాలు ► ఖమ్మంలో త్వరలో మరో రెండు ఎస్బీఐ బ్రాంచ్‌లు ► ఏప్రిల్ నాటికి ఎస్‌బీహెచ్‌లు ఎస్బీఐలోకి విలీనం: సీజీఎం గిరిధర్ కిని ఖమ్మం వ్యవసాయం: ఎస్బీఐ గృహ నిర్మాణాలకు తక్కువ వడ్డీతో రుణాలను అందజేస్తూ ప్రోత్సహిస్తుందని హైదరాబాద్ సర్కిల్ ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ గిరిధర్ కిని స్పష్టం చేశారు. గురువారం నగరంలోని బస్ డిపోరోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్బీఐ బ్రాంచ్‌ను ఆయన ప్రారంభించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గృహ నిర్మాణాలకు ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఎస్బీఐ కేవలం 8.65 శాతం వడ్డీతో గృహ నిర్మాణాలకు రుణాలను అందిస్తుందన్నారు. వ్యవసాయదారులకు రూపే కార్డులు.. వ్యవసాయదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులతో పాటు రూపే కార్డులను కూడా త్వరలో అందజేయనున్నామని తెలిపారు. రూపే కార్డు రైతులకు ఎంతో మేలు చేస్తుందని, ఈ కార్డు ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వంటి వాటిని కొనుగోలులో వినియోగించుకోవచ్చని తెలిపారు. రైతులకు పంట రుణాలతో పాటు ట్రాక్టర్ లోన్స్, అతి తక్కువ వడ్డీతో బంగారంపై రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ఫిక్స్డ్ డిపాజిట్లపై తమ బ్యాంక్ 8.85 శాతం వడ్డీని అందజేస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ముద్రా’ రుణాలను ఎటువంటి జమానతు లేకుండా రూ. 10 లక్షల వరకు ఇస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలో మరో రెండు బ్రాంచ్‌లు జిల్లాలో త్వరలో మరో రెండు ఎస్బీఐ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం, నగరంలోని మమతా మెడికల్ కళాశాల రోడ్లో బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్ల ఆయన తెలిపారు. తెలంగాణలో వరంగల్ జిల్లా తరువాత ఖమ్మం జిల్లాలో ఎస్బీఐ సేవలు ఎంతగానో ముందంజలో ఉన్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్ నాటికి ఎస్బీహెచ్ బ్యాంక్‌లు విలీనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) ఏప్రిల్ ఆఖరు నాటికి ఎస్బీఐలో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో ఎస్బీఐ రాష్ట్రంలో అగ్రగామిగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు బ్రాంచ్‌లన్నీ విలీనం అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్బీఐ తెలంగాణ సర్కిల్ రూ. 3 లక్షల కోట్ల టర్నోవర్‌తో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం నారాయణ రాజా, డీజీఎం భాస్కర్, నూతన బ్రాంచి మేనేజర్ కె.రవీందర్, కార్పొరేటర్లు దోరేపల్లి శ్వేత, కుమ్మరి ఇందిర, నాగండ్ల దీపక్ చౌదరి, పాలెపు రమణ, నవీన్‌కుమార్, ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఖాతాదారులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్‌షాపై కోడ్ ఉల్లంఘన కేసు
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement