-
24న ప్రముఖ హాస్య నటుడి వివాహం
చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు అశ్విన్ రాజా(కుంకి అశ్విన్) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జూన్ 24న చెన్నైలో తన ప్రేయసి విద్యాశ్రీని పెళ్లాడబోతున్నాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరగనుంది. కాగా గత నాలుగేళ్లుగా విద్యాశ్రీ, అశ్విన్ ప్రేమించుకుంటుండగా, ప్రస్తుతం మూడు ముళ్ల బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. (ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున) చెన్నైకు చెందిన రాజశేఖర్ కుమార్తె విద్యాశ్రీ. ఈమె అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కేవలం 20 మంది మాత్రమే పెళ్లికి హాజరు కానున్నట్లు సమాచారం. ఇక అశ్విన్.. లక్ష్మీ మూవీ మేకర్స్ నిర్మాతాల్లో ఒకరైన వి. స్వామినాథన్ కుమారుడు. హీరో ఆర్య నటించిన ‘బాస్ ఎంగిరా బాస్కరన్’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత దర్శకుడు ప్రభు సోలమన్ ‘కుంకి’ సినిమాలో నటించి మంచి పేరును సంపాదించారు. అప్పటి నుంచి తమిళ అభిమానులు అశ్విన్ రాజాను ప్రేమతో అశ్విన్ కుంకీ అని పిలుచుకుంటారు. (ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఔషధమే) -
సీక్వెల్ చాన్స్
‘మెంటల్ మదిలో, టిక్ టిక్ టిక్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ కథానాయిక నివేథా పేతురాజ్. చక్కటి హావభావాలతో పాటు గ్లామర్‌పరంగా మార్కులు కొట్టేశారు. దాంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టేశాయి. ఆల్రెడీ తమిళంలో మూడు సినిమాలు, తెలుగులో ఒక సినిమాతో బిజీగా ఉన్నారీ భామ. దానికి తోడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ కొట్టేశారట. 2012లో తమిళ నటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభుని పరిచయం చేస్తూ దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కుమ్కి’. తెలుగులో ‘గజరాజు’ పేరుతో రిలీజైంది. ఇప్పుడు ‘కుమ్కి’ సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డారట దర్శకుడు. ఈ సీక్వెల్లో హీరోయిన్గా నివేథా పేరును పరిశీలిస్తున్నారట. ఫస్ట్ పార్ట్‌లో యాక్ట్ చేసిన విక్రమ్ ప్రభునే ఈ సీక్వెల్లోనూ కనిపిస్తారు. ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనుంది. -
ఆ ట్విట్టర్ అకౌంట్ నాది కాదు : లక్ష్మీ మీనన్
టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది వాటివల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అభివృద్ది చెందుతున్న కొద్ది దాని వల్ల ఇబ్బంది పడుతున్న సెలబ్రిటీల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ట్విట్టర్లో లక్ష్మీ మీనన్ పేరుతో ఓ అకౌంట్ క్రియేట్ చేసిన ఆకతాయిలు అదే అఫీషియల్ అకౌంట్ అంటూ ప్రచారం చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులతో పాటు కొంతమంది లక్ష్మీ మీనన్ సన్నిహితులు కూడా ఆ ఖాతాను ఫాలో అయ్యారు. ఈ విషయం లక్ష్మీ మీనన్ వరకు వెళ్లటంతో అది తన అకౌంట్ కాదంటూ ప్రకటించింది ఈ కోలీవుడ్ బ్యూటీ. ఇప్పటికే ఫేస్బుక్లో అప్పుడప్పుడు అభిమానలుకు అందుబాటులో ఉండే లక్ష్మీ మీనన్ తన పేరుతో క్రియేట్ అయిన ట్విట్టర్ అకౌంట్ అఫీషియల్ కాదంటూ ఓ వీడియో మెసేజ్‌ను రిలీజ్ చేసింది. కుంకీ, జిగర్తాండ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ మీనన్ ఇటీవల మిరుథన్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి సరసన రెక్క సినిమాలో నటిస్తోంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
సన్ రైజర్స్ vs పంజాబ్..తారలతో నిండిన ఉప్పల్ స్టేడియం (ఫోటోలు)
ఆసీస్ యువ సంచలనానికి లక్కీ ఛాన్స్.. వరల్డ్‌కప్ జట్టులో చోటు!?
పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్‌టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉండాలనే తపన ..!
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
తప్పక చదవండి
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్‌గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement