-
కొమరక్క రాక్స్.... నాని, కీర్తి సురేష్ కామెడీ పీక్స్
-
సక్కనమ్మ చిక్కింది!
ఏ రంగంలోనైనా ప్రతిభకే పట్టం కడతారు. ఇక సినిమా రంగం విషయానికి వస్తే ప్రతిభ, అదృష్టంతో పాటు అందం చాలా ముఖ్యం. ఒకప్పటి కంటే ఇప్పటి హీరోయిన్లు అందాలను కాపాడుకోవడానికి ఎక్కువగానే కసరత్తులు చేస్తుంటారు. నటి కీర్తీసురేశ్ కూడా ఇందుకు అతీతం కాదు. కీర్తీççసురేశ్‌కు అదృష్టం అనేది తన రెండవ చిత్రంతోనే వరించింది. ఇక నటన అంటారా, మహానటి చిత్రంలోనే తన ప్రతిభాపాఠవాలను చాటుకుంది. మరింకేంటి అంటారా? అంతా బాగానే ఉంది అయితే మధ్యలో ఈ చిన్నది కాస్త బరువెక్కింది. సామి స్క్వేర్ లాంటి చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. పైగా ఆ సమయంలో కీర్తీసురేశ్ నటించిన సామీ స్క్వేర్, సండైకోళ–2 వంటి చిత్రాలు ఆమెను నిరాశ పరిచాయి. అదిగో అలాంటి సమయంలోనే అమ్మడికి బాలీవుడ్ నుంచి కాల్ వచ్చింది. ఇక బాలీవుడ్ సినీ వర్గాలు, అక్కడి సినీ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వారికి హీరోయిన్లు బొద్దుగా ఉంటే నచ్చదు. కీర్తీసురేశ్ స్లిమ్‌గా మారాల్సిన పరిస్థితి. ఇక డైట్లు, ఎక్సర్సైజ్లు అంటూ కసరత్తులు చేయక తప్పలేదు. మొత్తం ఈ సక్కనమ్మ చిక్కి మరింత నాజూగ్గా తయారైంది. సర్కార్ చిత్రం తరువాత ఈ బ్యూటీని తెరపై చూడలేదు. అలాగని నటిగా కీర్తీసురేశ్ ఖాళీగా లేదు. తెలుగు, తమిళం, మలయాళం, ఇప్పుడు అదనంగా హిందీ అంటూ బహుభాషా నటిగా బిజీగా ఉంది. చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల నటిగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం బోనీకపూర్ నిర్మిస్తున్న హిందీ చిత్రంలో అక్షయ్కుమా ర్కు జంటగా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది రెండవ భాగంలో తెరపైకి రానుంది. తమిళంలో దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ నిర్మి స్తున్న పెన్గి్వన్ చిత్రాన్ని పూర్తి చేసింది. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం. ఇందులో కీర్తీసురేశ్ గర్భిణిగా నటించడం మరో విశేషం. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న పెన్గి్వన్ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక తెలుగులోనూ రెండు చిత్రాల్లో నటిస్తున్న కీర్తీసురేశ్ కోసం సూపర్‌స్టార్ చిత్రం ఎదురుచూస్తున్నట్లు ఇప్పటికే టాక్ స్ప్రెడ్ అయిన విషయం తెలిసిందే. ఇక మాతృభాష మలయాళంలో ఎలాగూ నటిస్తూనే ఉంది కీర్తి. -
పండగ పందెం
-
ఈ నటి చాలా లక్కీ అట..!
సాక్షి, చెన్నై: ముంబై ముద్దుగుమ్మ సాయేషా సైగల్ ఇళయదళపతి విజయ్‌తో జత కట్టనుంది. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్ సరసన నటించే అవకాశం వచ్చింది. విజయ్ తన 62వ చిత్రంలోనూ ఇద్దరు ముద్దుగుమ్మలట. తెరి సినిమాలో సమంత, ఎమీజాక్సన్లతో యువళగీతాలు పాడేశారు. మెర్శల్ చిత్రంలో ఏకంగా సమంత ,కాజల్‌అగర్వాల్, నిత్యామీనన్‌లతో డ్యూయెట్లు పాడేశారు. ప్రస్తుతం తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్లో తుపాకీ, కత్తి చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్‌కు జంటగా నటి కీర్తిసురేశ్ ఎంపికయ్యారు. ఈ బ్యూటీతో సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలైంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఉంటుందన్న సమాచారాన్ని చిత్ర యూనిట్ ఆలస్యంగా వెల్లడించింది. వనమగన్ చిత్రంలో తన నటనలో చక్కని అభినయాన్ని ప్రదర్శించి, డాన్స్‌తో దుమ్మురేపిన ముంబై చిన్నది సాయేషా సైగల్. ఈ లక్కీ నటికి అతి తక్కువ సమయంలోనే విజయ్‌తో నటించే అవకాశం తలుపు తట్టింది. ఇప్పటికే కార్తీ, విజయ్‌సేతుపతిల సరసన నటిస్తూ బిజీగా ఉన్న సాయేషాకు విజయ్‌తో భారీ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ బ్యూటీది చిత్రంలో చాలా ప్రాధ్యానత ఉన్న పాత్ర అని సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. -
ఆరుసామి రెండో వేట మొదలెట్టాడు
తమిళసినిమా: సామి చిత్రంలో విక్రమ్ పోషించిన ఆరుసామి పాత్రను ఆయన అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు.అంతే కాదు నటుడు విక్రమ్‌ను పక్కా మాస్ హీరో గా నిలబెట్టిన చిత్రం సామి. 2003లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అందులో పోలీస్అధికారిగా విక్రమ్ అవినీతిపరులు, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారనే చెప్పాలి. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ తరువాత తెలుగులోనూ రీమేక్ అయ్యి పెద్ద విజయాన్ని సాధించింది. 14 ఏళ్ల తరువాత సామి చిత్ర సీక్వెల్ శ్రీకారం చు ట్టారు. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఇందులో సామి చిత్ర నాయకి త్రిష ఒక నాయకి, కీర్తీసురేశ్ మరో నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో బాబీసింహా, ప్రభు, వివేక్, సూరి నటిస్తున్నారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ కథా చిత్రాన్ని తమీన్ ఫిలింస్ ఇంతకు ముందు ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శిబు తమీన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న సామి–2 చిత్రం విజయదశమి సందర్భంగా శనివారం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. విక్రమ్, కీర్తీసురేశ్, దేవీశ్రీప్రసాద్, దర్శకుడు హరి, చిత్ర నిర్మాత శిబు తమీన్ పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు చిత్ర తొలి భాగాన్ని తిరునెల్వేలి పరిసర ప్రాంతాల్లో, రెండోభాగాన్ని రాజస్థాన్, ఉత్తరాది రాష్ట్రాల్లోనూ చిత్రీకరించనున్నట్లు వెల్లడించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్‌రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement