'జగన్ దీక్షకు జనమంతా అండగా నిలువాలి' | Sakshi
Sakshi News home page

'జగన్ దీక్షకు జనమంతా అండగా నిలువాలి'

Published Wed, Oct 7 2015 3:01 PM

'జగన్ దీక్షకు జనమంతా అండగా నిలువాలి' - Sakshi

గుంటూరు:  రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే స్వయం సమృద్ది సాధిస్తుందని ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్ష ప్రారంభించారని ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తెలిపారు. వై ఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ప్రజలందరూ మద్దతుగా నిలువాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  గుంటూరు జిల్లాలో వైఎస్ జగన్ నిరాహార దీక్ష వేదిక వద్దకు చేరుకున్న సందర్భంగా మర్రి రాజశేఖర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లో..


* ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, బీజేపీ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాయి.
* ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు. ప్రత్యేక ప్యాకేజీ గురించే మాట్లాడుతున్నాయి.
* నవ్యాంధ్ర రాజధాని కోసం 35వేల ఎకరాలను రైతుల నుంచి తీసుకున్నారు.  55వేల ఎకరాల అటవీ భూములను డీనోటీఫై చేసి తీసుకున్నారు. రాజధాని భూముల పేరిట రియల్ వ్యాపారం చేస్తున్నారు.
* ప్రత్యేక హోదాను పట్టించుకోకుండా చంద్రబాబు తన స్వయంసమృద్ధినే చూసుకుంటున్నారు.
* ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో జగన్, వైఎస్సార్సీపీ నేతలు గతంలో జాతీయస్థాయిలో పోరాడారు. ఢిల్లీలో ధర్నా చేశారు.
* ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేవరకు పోరాటం ఆగదని మన నాయకుడు జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్షకు దిగారు.
* దీక్షకు మద్దతుగా ఏపీ నలుములాల నుంచి ప్రజలు తరలివచ్చారు.
 

Advertisement
Advertisement