విధులు బహిష్కరించిన గ్రామ కార్యదర్శులు | Sakshi
Sakshi News home page

విధులు బహిష్కరించిన గ్రామ కార్యదర్శులు

Published Tue, Jan 27 2015 4:49 PM

vro's boycott the duties

నల్లగొండ(రాజాపేట): నకిరేకల్ మండలం తాటికల్ గ్రామ కార్యదర్శిపై జరిగిన దాడిని కండిస్తు మంగళవారం మండల కార్యదర్శులు పెన్‌డౌన్‌తో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్న ఉద్యోగులపై దాడికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరికి రెవెన్యూ కార్యదర్శులు, మండల పరిషత్, ఉపాధిహామీ, గ్రామ పంచాయతీ సిబ్బంది సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భువనగిరి శ్రీనివాస్, కార్యదర్శులు మదుసూధన్‌రె తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement