
కొందరు టీడీపీ నేతలు బంట్రోతులు: తలసాని
ముప్పై ఏళ్లపాటు పార్టీ ఉన్న తమలాంటి నాయకులు టీడీపీని ఎందుకు వీడుతున్నారో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్: ముప్పై ఏళ్లపాటు పార్టీ ఉన్న తమలాంటి నాయకులు టీడీపీని ఎందుకు వీడుతున్నారో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బుధవారం ఆయన టీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... సమాజమే దేవాలయం అని ఎన్టీఆర్ అంటే.. ఉన్నవాడే దేవుడు, కాంట్రాక్టర్లే పార్టీకి అండ అని చంద్రబాబు అంటున్నారని విమర్శించారు. కొందరు టీడీపీ నేతలు బంట్రోతులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పాడిందే పాడరా... చందంగా హైదరాబాద్ తానే అభివృద్ధి చేశానని పదేపదే చంద్రబాబు చెప్పుకోవడాన్ని తలసాని ఎద్దేవా చేశారు.