హైటెక్ సిటీని తానే కట్టించానని, అసలు ఏపీకి ఐటీని తీసుకొచ్చిందే తానని, హైదరాబాద్ నిర్మాణం సగం తనవల్లే అయ్యిందని పదే పదే చెప్పుకొనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరోసారి తన గొప్పలు చాటుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం టీడీపీ వల్లే వచ్చిందని ఆయన తాజాగా అన్నారు. దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టింది తామేనని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తీర్మానాన్ని నిరసిస్తూ తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
ఈ దీక్షకు చంద్రబాబు నాయుడు హాజరై మోత్కుపల్లికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను ఒక ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ పేరు మార్చే అవకాశం ఉన్నా సంప్రదాయాన్ని అనుసరించి పేరు మార్చలేదని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరు పెడతామని 2009లోనే చెప్పామని చంద్రబాబు అన్నారు. ఇప్పుడున్న నేతలు ఎన్టీఆర్ వల్లే రాజకీయాల్లోకి పైకొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. పేదవారి హక్కుల్ని కాపాడింది ఎన్టీఆరేనని ప్రశంసించారు.
కేసీఆర్, జానారెడ్డిలకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరేనని చంద్రబాబు అన్నారు. నూతన రాజధానిలో కొమురం భీం, చాకలి అయిలమ్మ, పీవీ నరసింహారావు పేర్లు గుర్తిండిపోయేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ శాసనసభలో టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టొద్దంటూ తీర్మానం చేసి తెలుగు ప్రజలను అవమానించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు ఆయన... ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు.
శంషాబాద్ విమానాశ్రయం మా వల్లే వచ్చింది: బాబు
Published Sat, Nov 22 2014 1:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement