వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల వీడియోల కలకలం | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల వీడియోల కలకలం

Published Sun, Feb 26 2017 9:29 AM

వాట్సాప్‌ గ్రూప్‌లో అశ్లీల వీడియోల కలకలం - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  ఓలా ఉబర్‌ క్యాబ్‌ డ్రైవర్స్‌ కమ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులుగా ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లలో అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టు చేసిన ఇద్దరు డ్రైవర్లను రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బొడుప్పల్‌కు చెందిన కందడి రఘుపాల్‌రెడ్డి, ఎంకే నగర్‌కు చెందిన సిద్దమ్‌ శ్రీధర్‌లను అరెస్టు చేసి, వారి నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్‌బీనగర్‌ హస్తినాపురం బ్యాంక్‌ కాలనీకి చెందిన .

శ్రీనివాస్‌  తెలంగాణ కార్‌ డ్రైవర్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌(టీసీడీవోఏ) పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశాడు. ఇందులో 111 మంది వాట్సాప్‌ సభ్యులుగా ఉన్నారు. అయితే ఇందులో సభ్యులుగా ఉన్న డ్రైవర్లు రఘుపాల్‌రెడ్డి, సిద్దమ్‌ శ్రీధర్‌ అశ్లీల వీడియోలు, ఫొటోలు పొస్టు చేయడంతో ఇతర డ్రైవర్లు వాట్సాప్‌ అడ్మినిస్ట్రేటర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శ్రీనివాస్‌ ఈ నెల 14న రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసిన ఇన్‌స్పెక్టర్‌ రియాజుద్దీన్‌ నేతృత్వంలోని బృందం నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు.

 దీనిపై వారిని పోలీసులు ప్రశ్నించగా సరదా, తమాషా కోసమే చేసినట్లు  సమాధానమిచ్చారు. వాట్సాప్‌ గ్రూప్‌ల్లో అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టు చేయడం నేరం కిందికి వస్తుందని, ఆయా వాట్సాప్‌ గ్రూప్‌ల్లోని సభ్యులు అభ్యంతరం చెబితే చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement