ముగిసిన పుష్కర పండుగ | Sakshi
Sakshi News home page

ముగిసిన పుష్కర పండుగ

Published Sun, Jul 26 2015 2:36 AM

ముగిసిన పుష్కర పండుగ - Sakshi

పన్నెండేళ్లకొచ్చిన పుష్కరాలు..
గోదారి వైపు సకల జన పరుగులు..
పన్నెండు రోజుల పుణ్యస్నానాలు..
లక్షలాదిగా భక్తజన హారతులు..
గంగమ్మ తీరం జనతీర్థంగా..
మంగపేట మురవంగా..
రామన్నగూడెం రాజసంగా..
ముల్లకట్ట మురిపెంగా..
ఉట్టిపడిన సంప్రదాయం..
సమ్మక-సారలమ్మకు వందనం..
హేమాచలుడికి నీరా‘జనం’..
కాకతీయ కళను చాటిన
రామప్ప దర్శనం..
గోదావరి పుష్కర మహోత్సవాలు శనివారం వైభవంగా ముగిశారుు. మంగపేటలో డిప్యూటీ సీఎం శ్రీహరి, జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ, ఎమ్మె ల్యే ధర్మారెడ్డి, కలెక్టర్, ఎస్పీ పూజలు చేశారు. పూజారులు గోదారమ్మకు సంధ్యాహారతి ఇచ్చి, పన్నెండేళ్లకు కలుద్దామని బై..బై చెప్పారు.

ముగిసిన పుష్కర మహోత్సవాలు
- గోదావరి తల్లికి సంధ్యా హారతితో ఘన వీడ్కోలు
- మంగపేటలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కవిత పూజలు
- హాజరైన జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ, ఎమ్మెల్యే ధర్మారెడ్డి
సాక్షి, హన్మకొండ :
గోదావరి పుష్కర పండుగ ముగిసింది. చివరిరోజు శనివారం వరకు జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్ట ఘాట్లలో సుమారు 25ల క్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారని అధికారులు అంచనా వేశారు. 12రోజుల పాటు పో లీసులు, రెవెన్యూ అధికారులతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు ‘పుష్కర’ సేవలో నిమగ్నమయ్యాయి.
 
అగ్రస్థానంలో మంగపేటఘాట్
గోదావరి నదిలోని రామన్నగూడెం, ముల్లకట్ట తది తర ప్రాంతాల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో తక్కువ సంఖ్యలోనే భక్తులు పుష్కర స్నానా లు ఆచరించారు. అరుుతే, నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న మంగపేట ఘాట్ వద్ద 90శాతం మంది పుణ్యస్నానాలు చేశారు. మంగపేట్‌తోపాటు రామన్నగూడెం, మంగపేటలోనూ నీటి నిల్వలు ఉన్న ప్రాంతం లో చలువపందిళ్లు, మహిళలు బట్టలు మార్చుకునే గదు లు ఏర్పాటు చేశారు. డిప్యూ టీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపీ అజ్మీరా సీతారాయం నాయక్ స్వయంగా ఏర్పాట్లు పర్యవే క్షించారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జేసీ ప్రశాంత్ జీవన్ పాటి ల్, ములుగు ఆర్డీవో మహేందర్‌జీ, ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్ ఘాట్ల వద్దే మకాం వేశారు.
 
పోలీసుల అంకితభావం
వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా 12 రోజు ల పాటు పుష్కరఘాట్ల వద్దే ఉంటూ భక్తుల సేవలో నిమగ్నమయ్యూరు. భక్తులు వదిలేసిన వ్యర్థ్యాలు, చెత్తాచెదారం పేరుకుపోకుండా పారిశుధ్య కార్మికు లు వందలాదిమంది పుష్కరఘాట్లు, గోదావరి తీ రంతోపాటు సమీప గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో విశ్రమించకుండా పనిచేశారు. నీటిలో దిగి స్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి ప్రమాదం సంభవించకుండా సుమారు 90 మంది గజఈత గాళ్లు అనునిత్యం కంటికి రెప్పలా కాపలాకాశారు.
 
జనహారతి
మంగపేట :
పన్నెండు రోజుల్లో గోదావరితో కలి సి సుమారు 25 లక్షల మంది భక్తులను దీవిం చిన పుష్కరుడు శనివారం సెలవు తీసుకున్నా డు. ప్రభుత్వం తర ఫున డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సాయంత్రం 5.35 గంటలకు శాస్త్రోక్తంగా పుష్కరాలకు సమాప్తం పలికారు. శ్రీసూక్త పద్ధతి న హేమాచల నర్సింహస్వామి, ఉమాచంద్రశేఖ రస్వామి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, సుదర్శన అళ్వార్, గంగమ్మకు షోడ శోపచార పూ జలు నిర్వహించారు. అనంతరం తలపై హేమాచల లక్ష్మీనర్సింహస్వామి శఠారి, పాదుకలు త లపై ధరించిన కడియం గోదావరి వైపు అడుగు వేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, కలెక్టర్ వాకాటి కరుణ ఆయన ముందు నడిచి గోదారమ్మకు చీరసారెలు సమర్పించారు. అనంతరం వీరు జల్లుస్నానం చేయడంతో పుష్కరాలు ముగి సినట్లరు్యంది. అర్చకులు విస్సావఝ్జల నరేశ్‌శర్మ, కొయ్యాడ శివరాం, వెంకటనారాయణ, రాజీవ్‌నాగశర్మ ఆధ్వర్యంలో గోదావరి మాతకు సంధ్యాహారతినిచ్చారు.

Advertisement
Advertisement