మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌ | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌

Published Thu, Dec 13 2018 1:52 AM

Telugu Titans won the second consecutive defeat - Sakshi

సాక్షి, విశాఖపట్నం: సొంత ప్రేక్షకుల మధ్య తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 24–37తో బెంగళూరు బుల్స్‌ చేతిలో ఓడింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి (4 పాయింట్లు) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.

నీలేశ్‌ 6 పాయింట్లు సాధిం చాడు. బుల్స్‌ తరఫున పవన్‌ 13 పాయింట్లతో మెరిశాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ 47–37తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. సొంతగడ్డపై జరిగే చివరి మ్యాచ్‌లో నేడు పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడనుంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement