స్కాట్లాండ్ భారీ స్కోరు | Sakshi
Sakshi News home page

స్కాట్లాండ్ భారీ స్కోరు

Published Thu, Mar 5 2015 7:20 AM

స్కాట్లాండ్ భారీ స్కోరు

నెల్సన్: ఓపెనర్ జేమ్స్ కోయెట్జర్ సెంచరీతో చెలరేగడంతో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో స్కాట్లాండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది. బంగ్లాకు 319 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు దిగిన స్కాట్లాండ్ 13 పరుగులకే ఫస్ట్ వికెట్ కోల్పోయింది.

116 పరుగులకు 3 వికెట్లు నష్టపోయిన స్కాట్లాండ్ ను కోయెట్జర్, మామ్సన్ భారీ స్కోరుగా దిశగా నడిపించారు. వీరిద్దరూ 4వ వికెట్ కు 113 బంతుల్లో 141 పరుగులు జోడించారు. కోయెట్జర్ 156 పరుగులు చేసి ఐదో వికెట్ గా అవుటయ్యాడు. మామ్సన్ 35,  మెక్లియోడ్ 11, గార్డినర్ 19, మాకన్ 35, బేరింగ్టన్ 26, మాథ్యూ క్రాస్ 20 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, నాసిర్ హొస్సేన్ 2 వికెట్లు పడగొట్టారు. మోర్తజా, సబ్బీర్ చెరో వికెట్ తీశారు.

Advertisement
Advertisement