మళ్లీ సానియాదే పైచేయి | Sakshi
Sakshi News home page

మళ్లీ సానియాదే పైచేయి

Published Fri, Nov 27 2015 12:49 AM

మళ్లీ సానియాదే పైచేయి

సాక్షి, హైదరాబాద్: ఆ నలుగురి ఖాతాలో ఏకంగా 92 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు వారంతా ఒక చోట చేరి టెన్నిస్ అభిమానులను అలరించారు. ఎగ్జిబిషన్ మ్యాచే అయినా నలుగురు దిగ్గజాల ఆటను ఒకే మ్యాచ్‌లో ప్రత్యక్షంగా చూసే అవకాశం ఫ్యాన్స్‌కు దక్కింది. ఐటీపీఎల్ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మూడు మ్యాచ్‌లలో రెండోది గురువారం ఇక్కడి సానియా మీర్జా అకాడమీలో జరిగింది. తొలి మ్యాచ్‌లో మహేశ్ భూపతితో కలిసి బరిలోకి దిగిన సానియా, ఈ సారి లియాండర్ పేస్‌తో జత కట్టింది. ఈ మ్యాచ్‌లో సానియా-పేస్ జోడి వరుస సెట్లలో 6-2, 7-6 (7-3)తో మహేశ్ భూపతి-మార్టినా నవ్రతిలోవా జంటను చిత్తు చేసింది. ఈ టూర్‌లో  చివరి మ్యాచ్ శుక్రవారం న్యూఢిల్లీలో జరుగుతుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement