సవాల్‌ను అధిగమిస్తా | Sakshi
Sakshi News home page

సవాల్‌ను అధిగమిస్తా

Published Wed, Dec 7 2016 2:00 AM

సవాల్‌ను అధిగమిస్తా

  కొత్త కుర్రాడు కీటన్ జెన్నింగ్స్ ఆత్మవిశ్వాసం  
 ముంబై: భారత్‌లాంటి వేదికపై తొలి టెస్టు ఆడటం ఏ విదేశీ క్రికెటర్‌కైనా పెద్ద సవాలేనని ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ కీటన్ జెన్నింగ్స్ అభిప్రాయపడ్డాడు. అయితే తాను దీనికి సిద్ధంగా ఉన్నట్లు అతను వెల్లడించాడు. గాయపడి స్వదేశం తిరిగి వెళ్లిన హసీబ్ హమీద్ స్థానంలో ముంబై టెస్టులో జెన్నింగ్‌‌స ఓపెనర్‌గా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ‘ఇక్కడ బాగా ఆడగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఉండదు. ఒకవేళ విఫలమైనా ఇబ్బంది లేదు. నాపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవం.
 
  అయితే దీనిని ఇష్టపడతాను. సానుకూల దృక్పథంతో ఆడే ప్రయత్నం చేస్తా. భారత్‌కు సిరీస్‌లో తగిన జవాబివ్వగలమని విశ్వాసంతో ఉన్నా’ అని కీటన్ వ్యాఖ్యానించాడు. 24 ఏళ్ల కీటన్ ప్రముఖ కోచ్ రే జెన్నింగ్‌‌స కొడుకు. దక్షిణాఫ్రికాలో పుట్టిన అతను ఆ దేశం తరఫున అండర్-19 స్థాయిలో అంతర్జాతీయ వన్డేలు కూడా ఆడాడు. తల్లి పాస్‌పోర్ట్ అండతో ఇంగ్లండ్ వలస వెళ్లి ఇప్పుడు ఆ జట్టులోకి ఎంపికయ్యాడు. రే జెన్నింగ్‌‌స ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు కోచ్‌గా ఉన్న సమయంలో తండ్రి వెంట భారత్‌కు వచ్చిన అతను, ఇప్పుడు అంతర్జాతీయ ఆటగాడిగా మళ్లీ భారత్‌లో అడుగు పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement