ఆసియా క్రీడలకు జ్యోతి సురేఖ  | Sakshi
Sakshi News home page

ఆసియా క్రీడలకు జ్యోతి సురేఖ 

Published Sat, Jun 16 2018 1:09 AM

Jyothi Surekha Vennam brews a medal-storm - Sakshi

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంలో ఆర్చర్‌ జ్యోతి సురేఖకు చోటుదక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ ఆగస్టు 19 నుంచి ఇండోనేసియాలోని జకర్తా వేదికగా జరుగనున్న ఆసియా క్రీడల్లో బరిలో దిగనుంది. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనడం ఆమెకు ఇది రెండోసారి.

ఆసియా క్రీడలకు ముందు సురేఖ జూన్‌ 19 నుంచి అమెరికాలో జరిగే ప్రపంచకప్‌ స్టేజ్‌–3, జూలై 16 నుంచి జర్మనీలో జరిగే వరల్డ్‌కప్‌ స్టేజ్‌–4 పోటీల్లో పాల్గొననుంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement