'నంబర్ వన్ బౌలర్ కావడం ఖాయం' | Sakshi
Sakshi News home page

'నంబర్ వన్ బౌలర్ కావడం ఖాయం'

Published Tue, May 23 2017 12:30 PM

'నంబర్ వన్ బౌలర్ కావడం ఖాయం'

న్యూఢిల్లీ: ఇండియన్స్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన పేసర్ జస్ర్పిత్ బూమ్రాపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అతని వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అయ్యే లక్షణాలు చాలా మెండుగా ఉన్నాయంటూ కొనియాడాడు. రోజు రోజుకీ మెరుగుపడుతున్న బూమ్రా త్వరలోనే టీమిండియా తరపున టెస్టుల్లో కూడా అరంగేట్రం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

'బూమ్రా సత్తా ఏమిటో అతనికి తెలుసు. ఐపీఎల్ టోర్నమెంట్ ఆద్యంతం బూమ్రా మెరిసిన తీరు అద్భుతం. గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో ఆరు పరుగులిచ్చి అరోన్ ఫించ్, బ్రెండన్ మెకల్లమ్ వంటి స్టార్లకు అడ్డుకట్ట వేయడమే అతని బౌలింగ్ లోని ప్రతిభకు నిదర్శనం. కచ్చితంగా బూమ్రా ప్రపంచ నంబర్ వన్ బౌలర్ అవుతాడు'అని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement