600 కోట్ల హెరాయిన్ పట్టివేత | Sakshi
Sakshi News home page

600 కోట్ల హెరాయిన్ పట్టివేత

Published Tue, Apr 21 2015 4:07 PM

600 కోట్ల హెరాయిన్ పట్టివేత - Sakshi

పోర్బందర్:  అక్రమంగా గుజరాత్ తీరంలోకి  ప్రవేశించిన  మరో పాకిస్థాన్ బోటును పట్టుకున్నారు. పాక్ నుంచి  గుజరాత్ మీదుగా భారత్లోకి భారీఎత్తున మత్తుమందులు,  శాటిలైట్ ఫోన్లు తదితరాలతో ప్రవేశిస్తున్న ఈ భారీ నావను నౌకాదళ అధికారులు సీజ్ చేశారు.  భారత నౌకాదళ అధికారులు, కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో గుజరాత్లోని  పోరుబందర్ పోర్ట్లో ఈ నౌకను పట్టుకున్నారు.  ఇందుకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశారు.

ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు గత కొన్ని రోజులుగా నిఘాపెట్టినట్లు నౌకా దళ అధికారులు తెలిపారు.  దీనిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన అధికారులు, దీనికి  ఉగ్రచర్యలకు సంబంధం ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. సుమారు 140 కిలోల హెరాయిన్ను  స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీని విలువ 600కోట్ల రూపాయల విలువ  ఉంటుందని  సమాచారం.

అలాగే  పాక్ నావకు సమీపంలో  అనుమానాస్పదంగా  కనిపించిన భారత మత్స్యకారులను ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.  సంచలనం రేపుతున్న ఈ వ్యవహారంపై  పూర్తి వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.  దీనిపై  విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement