తొమ్మిదో వికెట్ కూడా పడింది!! | Sakshi
Sakshi News home page

తొమ్మిదో వికెట్ కూడా పడింది!!

Published Thu, Aug 28 2014 2:44 PM

తొమ్మిదో వికెట్ కూడా పడింది!! - Sakshi

నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వరుసగా తొమ్మిదో వికెట్ పడింది. అవును.. మరో గవర్నర్ రాజీనామా చేశారు. మణిపూర్ గవర్నర్గా వ్యవహరిస్తున్న వీకే దుగ్గల్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపారు. యూపీఏ హయాంలో ఉన్న గవర్నర్లంతా ఒకరి తర్వాత ఒకరుగా రాజీనామాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడటంతో.. ఇప్పటికి ఎనిమిది మంది గవర్నర్లు తమ పదవుల నుంచి స్వచ్ఛందంగానో, బలవంతంగానో తప్పుకోవాల్సి వచ్చింది.

యూపీఏ గవర్నర్లు రాజీనామా చేయాలన్న సంకేతాలు వెలువడగానే ముందుగా బీఎల్ జోషి, శేఖర్ దత్, అశ్వనీకుమార్ రాజీనామాలు చేశారు. ఆ తర్వాత బీవీ వాంఛూ, ఎంకే నారాయణన్ అగస్టా వెస్ట్లాండ్ వ్యవహారంలో సీబీఐ ప్రశ్నించడంతో కలత చెంది పదవుల నుంచి తప్పుకొన్నారు. ఆ తర్వాత తనను నాగాలాండ్కు బదిలీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బి.పురుషోత్తమన్ తప్పుకొన్నారు. ఇలా వరుసపెట్టి రాజీనామాల పర్వం కొనసాగింది. చిట్టచివరగా రెండు రోజుల క్రితం కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ సైతం రాజీనామా చేశారు. ఇప్పుడు దుగ్గల్ వంతు వచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement