కుక్క - ఆధార్ - అరెస్టు | Sakshi
Sakshi News home page

కుక్క - ఆధార్ - అరెస్టు

Published Fri, Jul 3 2015 2:37 PM

కుక్క - ఆధార్ - అరెస్టు - Sakshi

భోపాల్: కుక్క పేరుతో ఆధార్ కార్డు తీసుకున్న వ్యక్తిని మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలో  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ అధికారులను తప్పుదారి పట్టించాడని ఆరోపిస్తూ ఆజాంఖాన్ ను గురువారం అరెస్టుచేశారు. ఆధార్ కార్డ్ జారీ ప్రక్రియలోని అవకతవకలను వెలుగులోకి తెచ్చే క్రమంలో ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. 

మనుషులకు బదులుగా జంతువుల పేరుతో ఆధార్ కార్డులను జారీచేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు  విచారణ చేపట్టారు. ఉమ్రి అనే గ్రామంలో  టామీ సింగ్  సన్ ఆఫ్ షేరూ సింగ్ పేరుతో ఒక కుక్కకు జారీ అయిన ఆధార్ కార్డును అధికారులు గుర్తించారు. టామీ సింగ్, పుట్టినరోజు తేదీ 2009 నవంబర్ 26  తదితర వివరాలతో ఈ ఆధార్ కార్డును సంపాదించాడు.  దీంతో ఆ కార్డును స్వాధీనం చేసుకున్న అధికారులు  అజాం ఖాన్పై కేసు నమోదు చేశారు. ఇంతకీ సదరు ఆజంఖాన్ ఎవరో కాదు.. ఉమ్రి గ్రామంలో ఆధార్ కార్డు జారీ కేంద్రానికి స్వయానా సూపర్ వైజర్.

దీంతో ఈ వ్యవహారంలో అజాంఖాన్పై ఫోర్జరీ కేసు నమోదు చేశామని పోలీసు అధికారి తోమర్ తెలిపారు.  ఇలా జంతువుల పేర్లతో ఇంకా ఎవరైనా కూడా ఆధార్ కార్డులు తీసుకున్నారా అనే  విషయాలను ఆరా తీస్తున్నామన్నారు.

Advertisement
Advertisement