‘మహా’ రైతుకు రుణ మాఫీ | Sakshi
Sakshi News home page

‘మహా’ రైతుకు రుణ మాఫీ

Published Mon, Jun 12 2017 2:20 AM

‘మహా’ రైతుకు రుణ మాఫీ - Sakshi

తాత్కాలికంగా మహారాష్ట్ర రైతుల ఆందోళన విరమణ
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రైతులకు రుణ మాఫీ చేస్తామని ప్రకటిం చింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  రైతు సమస్యల పరిష్కారానికి  నియమించిన ఉన్నత స్థాయి కమిటీ,  రైతు నాయకుల మధ్య చర్చల్లో ఆ మేరకు అంగీకారం కుదిరింది. దీంతో ఈ నెల ఒకటి నుంచి రైతులు ప్రారంభించిన ఆందోళ నను విరమించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం సూత్ర ప్రాయంగా రైతులకు రుణ మాఫీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలను జాయింట్‌ కమిటీ నిర్ణయిస్తుంది.

ఈ నిర్ణయం వల్ల 1.07 కోట్ల మంది రైతులకు లాభం కలుగుతుంది. చిన్న, మధ్య తరహా రైతులకు సంబంధించిన సుమారు రూ. 30 వేల కోట్ల రుణాలు రద్దవుతాయి. పాల ధరలు కూడా పెంచాలని నిర్ణయించాం. సుగర్‌ పరిశ్రమ తరహాలోనే పాలలో వచ్చే లాభాలను 70:30 నిష్పత్తిలో తీసుకోవడానికి మిల్స్‌ సొసైటీలు అంగీకరించాయి’ అని చెప్పారు.   చర్చల్లో పాల్గొన్న రైతు నాయకుడు  రాజు శెట్టి మాట్లాడుతూ తమ డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ‘చర్చలు సానుకూ లంగా జరిగాయి.  ఆందోళనలన్నీ తాత్కాలి కంగా ఆపుచేయాలని నిర్ణయించాం. జూలై 25 లోగా సంతృప్తికర నిర్ణయం తీసుకోకుంటే తిరిగి ఆందోళన ప్రారంభిస్తాం’ అని వివరిం చారు. రైతుల ‘అన్ని రకాల రుణాలు’ రద్దు చేస్తామని మంత్రుల బృందం హామీ ఇచ్చిం దని మరో రైతు నాయకుడు రఘునాథ్‌దాదా పాటిల్‌ చెప్పారు.

ఆందోళన బాటలో యూపీ రైతులు
అలీగఢ్‌ (యూపీ): బంగాళాదుంపలకు గిట్టుబాటు ధర లేకపోవడం, సరిహద్దు వ్యవసాయ భూములపై హరియాణా రాష్ట్రం తో నెలకొన్న దీర్ఘకాల వివాదం పరిష్కారం కాకపోవడంతో యూపీలోని అలీగఢ్‌ రైతులు ఆందోళన బాట పట్టారు. గత 24 గంటలుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నట్లు సమాచారం. భార తీయ కిసాన్‌ యూనియన్‌ (హర్‌పాల్‌ గ్రూప్‌) జాతీయ అధ్యక్షుడు మీడియాతో మాట్లా డుతూ రైతుల సమస్యలు పరిష్కారం కాకుంటే ‘జైల్‌భరో’ కార్యక్రమాన్ని చేపడతా మని హెచ్చరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement