రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు | Sakshi
Sakshi News home page

సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు

Published Sat, May 11 2019 5:14 PM

Fire in Bhubaneswar Bound Rajdhani Express - Sakshi

భువనేశ్వర్‌ : ఢిల్లీ - భువనేశ్వర్‌ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా ఖంటపడ రైల్వే స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. రైలు చివరి పెట్టె అయిన జనరేటర్‌ బోగిలో మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే ఆ బోగిని వేరు చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులేవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

గత నెలలో ఇదే రైలులో కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థతతకు గురయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటికప్పుడు రైలును బొకారో రైల్వే స్టేషన్‌లో ఆపి అస్వస్థతకు గురైన ప్రయాణికులకు చికిత్స అందించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement