గాడ్సే చెప్పిందేంటి? | Sakshi
Sakshi News home page

గాడ్సే చెప్పిందేంటి?

Published Sat, Feb 18 2017 2:06 AM

గాడ్సే చెప్పిందేంటి?

గాంధీ హత్య కేసు వివరాలు చెప్పాలంటూ ఎన్ఏఐని ఆదేశించిన సీఐసీ  
న్యూఢిల్లీ: గాంధీజీ హత్య కేసు వివరాలను, హంతకుడు నాథురామ్‌ గాడ్సే విచారణలో ఇచ్చిన వాంగ్మూలాన్ని వెల్లడించాలని నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియాను (ఎన్ఏఐ) కేంద్ర సమాచార కమిషన్  (సీఐసీ) ఆదేశించింది. ఆ వివరాలన్నింటిని ఎన్ఏఐ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని సూచించింది. చార్జ్‌షీట్, వాంగ్మూలాన్ని వెల్లడించాలని  అశుతోష్‌ బన్సాల్‌ అనే వ్యక్తి ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ దరఖాస్తును ఢిల్లీ పోలీసులు ఎన్ ఏఐకి బదిలీ చేశారు.

కాగా, ఆ వివరాలను తమ వెబ్‌సైట్‌లో శోధించి కావాల్సిన సమాచారాన్ని పొందాలని దరఖాస్తుదారుడికి ఎన్ ఏఐ సూచించింది. దీంతో సమాచారాన్ని పొందడంలో విఫలమైన బన్సాల్‌.. సీఐసీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆచార్యులును ఆశ్రయించాడు. ఆయన స్పందించి దరఖాస్తుదారుడు అడిగిన సమాచారాన్ని రికార్డ్స్‌లో ఇండెక్స్‌తో సహా అందించాలన్నారు. దరఖాస్తుదారుడి నుంచి పేజీకి రూ. 2 చొప్పున వసూలు చేస్తూ 20 రోజుల్లోగా గాంధీ హత్య కేసు చార్జ్‌షీట్‌ పత్రాలను, గాడ్సే వాంగ్మూలాన్ని సీడీ రూపంలో అందించాలని ఆదేశించారు.

Advertisement
Advertisement