బన్నీ సినిమా నుంచి రావు రమేష్‌ అవుట్‌! | Sakshi
Sakshi News home page

బన్నీ సినిమా నుంచి రావు రమేష్‌ అవుట్‌!

Published Tue, Jul 30 2019 12:56 PM

Rao Ramesh Exits From Allu Arjun, Trivikram Srinivas Movie - Sakshi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సీనియర్‌ నటుడు రావూ రమేష్ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

అయితే రావు రమేష్ తప్పుకోవటం వెనకు ఎలాంటి వివాదాలు లేదు. కేవలం డేట్స్‌ సర్దుబాటు కానీ కారణంగానే ఆయన తప్పుకున్నారట. ముందుగా అనుకున్న సమయం కన్నా షూటింగ్ ఆలస్యం కావటంతో రావు రమేష్ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. దీంతో ఆయన స్థానంలో హర్షవర్దన్‌ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌, సుశాంత్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement