సోగ్గాడి కొడుకే హీరో నాయనా! | Sakshi
Sakshi News home page

సోగ్గాడి కొడుకే హీరో నాయనా!

Published Wed, Feb 10 2016 10:32 PM

సోగ్గాడి కొడుకే హీరో నాయనా!

 మొన్న సంక్రాంతికి విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సంచలన విజయం సాధించి త్వరలో 50 కోట్ల  క్లబ్‌లో చేరనుంది. నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకునిగా పరిచయమయ్యారు. రొమాన్స్, ఫాంటసీ మిళితమైన ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో కల్యాణ్‌కృష్ణ మంచి మార్కులు కొట్టేశారు. ఆయన రెండో చిత్రం ఎవరితో చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఆయన తదుపరి చిత్రానికి సోగ్గాడి కొడుకే హీరో! నాగచైతన్య హీరోగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సినిమా చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. కల్యాణ్‌కృష్ణ చెప్పిన కథ అటు నాగార్జునకు, ఇటు నాగచైతన్యకు విపరీతంగా నచ్చేసిందట.

 చైతన్య ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో పాటు మలయాళ ‘ప్రేమమ్’ రీమేక్ ‘మజ్ను’లో నాగచైతన్య నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలూ ఏప్రిల్ నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాత కల్యాణ్ కృష్ణతో సినిమా చేయడానికి ఈ యువ హీరో ఆసక్తిగా ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement