-
ఈ సినిమాలు ఆగిపోలేవు..
ఉందా? లేదా? లేదట.... కాదు.. కాదు.. ఉందట! ఈ మధ్య కొన్ని చిత్రాల గురించి జరిగిన చర్చ ఇది. ‘ఆగిపోయింది’ అంటూ ఆ చిత్రాలపై వచ్చిన వార్తలకు స్పందించి... ‘ఉందండోయ్’ అని చిత్రబృందం స్పష్టం చేసింది. ఆ చిత్రాలేంటో చూద్దాం. బంగార్రాజు వస్తాడు ఐదేళ్ల క్రితం సంక్రాంతి పండగకి నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు. బంగార్రాజుగా పంచె కట్టుకుని, ‘సోగ్గాడే చిన్ని నాయనా.. ఒక్క పిట్టనైన కొట్టలేడు సోగ్గాడు..’ అంటూæ అమ్మాయిలతో నాగ్ వేసిన స్టెప్పులు అదుర్స్. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016)లో బంగార్రాజు, రాము పాత్రల్లో నటించారాయన. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ని ఎప్పుడో ప్రకటించారు. ప్రీక్వెల్ అంటే.. ముందు జరిగిన కథ అన్నమాట.. ‘సోగ్గాడే..’లో బంగార్రాజు చనిపోతాడు... అసలు బంగార్రాజు కథేంటి అనేది ప్రీక్వెల్. అయితే ‘సోగ్గాడే..’ వచ్చి ఐదేళ్లు కావడంతో ప్రీక్వెల్ ఇంకా మొదలుపెట్టలేదు కాబట్టి, ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. కానీ, ఆగలేదు. ఈ విషయాన్ని ‘వైల్డ్ డాగ్’ ప్రమోషన్స్ అప్పుడు నాగార్జున స్వయంగా చెప్పారు. సో... ‘బంగార్రాజు ఈజ్ బ్యాక్’. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటించే అవకాశం ఉంది. ఆన్‌లోనే ఉంది హీరో అల్లు అర్జున్–దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఎప్పుడో రూపొందాల్సింది కానీ, ఇప్పటివరకూ జరగలేదు. ఇక ఈ కాంబినేషన్ లేనట్లే అని ఈ మధ్య చాలామంది ఫిక్సయ్యారు. దానికి కారణం ‘పుష్ప’ పూర్తి చేశాక కొరటాల శివ సినిమాలోనే అల్లు అర్జున్ చేయాలి. కానీ ఎన్టీఆర్ హీరోగా కొరటాల దర్శకత్వం వహించే సినిమా తెరపైకి వచ్చింది. దాంతో బన్నీ–కొరటాల సినిమా లేనట్లే అని ఎవరికివారు ఫిక్సయ్యారు. కానీ, ‘ప్రాజెక్ట్ ఆన్‌లోనే ఉంది’ అని నిర్మాణ సంస్థ యువసుధ పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఈ సినిమా ఆరంభం అవుతుంది. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని ఎప్పుడో ప్రకటించారు. ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్ లేదనే వార్తలు వచ్చాయి కానీ, ‘ఐకాన్’ ఉంటుందని ఇటీవల ‘దిల్’ రాజు పేర్కొన్నారు. మారలేదు ‘ప్లాన్ మారలేదు.. ముందు అనుకున్న ప్రకారమే ముందుకు వెళతాం’ అంటూ ఇటీవల ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ సంస్థ ప్రకటించింది. విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించనున్న సినిమా గురించే ఈ ప్రకటన. ఈ సినిమా లేదంటూ వచ్చిన వార్తలకే ‘ఉంది’ అని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’లో నటిస్తున్నారు. సుకుమార్ ‘పుష్ప’ తెరకెక్కిస్తున్నారు. ఈ ఇద్దరూ తమ చిత్రాలు పూర్తి చేశాక.. వీరి కాంబినేషన్ సినిమా ఆరంభమవుతుంది. భారతీయుడు ఆగడు! కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (భారతీయుడు) ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం వచ్చిన పాతికేళ్లకు ‘ఇండియన్ 2’కి శ్రీకారం చుట్టారు కమల్–శంకర్. కొన్నాళ్లు షూటింగ్ కూడా జరిగింది. షూటింగ్లో జరిగిన ప్రమాదం వల్ల చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఆ తర్వాత తమిళనాడు ఎన్నికల కోసం కమల్ బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి, ఇక పట్టాలెక్కడమే ఆలస్యం అనుకుంటున్న సమయంలో రామ్‌చరణ్ హీరోగా శంకర్ ఒక సినిమా ప్రకటించడం, అలాగే రణ్వీర్ సింగ్‌తో ‘అన్నియన్’ (అపరిచితుడు) రీమేక్ ప్రకటించడంతో ‘భారతీయుడు 2’ ఏమైంది? అనే టాక్ మొదలైంది. ‘ఇండియన్ 2’ నిర్మాణ సంస్థ లైకా కూడా కూడా శంకర్ ఈ సినిమాని మధ్యలో వదిలేయడం సరికాదని కోర్డుకెక్కింది. ‘‘నేనేం వదల్లేదు.. ‘భారతీయుడు ఆగడు’. దీనికి విదేశీ సాంకేతిక నిపుణులు కావాలి. అలాగే కమల్ డేట్స్ ఇస్తే.. నేను షూట్‌కి రెడీ’ అని శంకర్ విన్నవించుకున్నారు. చిన్న బ్రేక్.. అంతే! కరణ్‌జోహార్ దర్శకత్వంలో జాన్వీ కపూర్ నటిస్తున్న కొత్త సినిమా కూడా ఆగిపోలేదట. గత ఏడాది ఫిబ్రవరిలో తన దర్శకత్వంలో ‘తక్త్’ అనే సినిమాని ప్రకటించారు కరణ్ జోహార్. దానిలో జాన్వీకపూర్‌ది ఓ కీలకపాత్ర. కానీ ఆ చిత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. రణ్వీర్ సింగ్, అనిల్ కపూర్, కరీనా కపూర్, ఆలియా భట్, భూమీ పెడ్నేకర్ తదితర భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ‘తక్త్’ ఆగిందనే వార్తలకు స్పందిస్తూ – ‘‘ఆగలేదు... చిన్న బ్రేక్ పడింది.. అంతే’’ అని కరణ్ జోహార్ అన్నారు. ‘ఖిలాడి’గా రవితేజను, ‘టక్ జగదీష్’గా నానీని, ‘వరుడు కావలెను’లో నాగశౌర్యను ఇదివరకే చూశాం. పలు సందర్భాల్లో ఈ చిత్రం పోస్టర్లు విడుదలయ్యాయి, శ్రీరామ నవమికి కూడా ఈ చిత్రాల ఫొటోలు విడుదలయ్యాయి. రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఖిలాడి’. మీనాక్షీ చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇక, హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘టక్ జగదీష్’. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు, నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ చిత్రా నికి లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. -
బంగార్రాజు భలే నాయనా
సోగ్గాడే చిన్ని నాయనా.. బొమ్మ అదిరింది నాయనా అని సినిమా చూసినవాళ్లు అన్నారు. మూడేళ్ల క్రితం సంక్రాంతికి సోగ్గాడిగా సందడి చేసిన బంగార్రాజుని మళ్లీ చూపించనున్నారు చిత్రదర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఫస్ట్ పార్ట్‌లో నాగార్జున మాత్రమే సందడి చేశారు. రెండో భాగంలో కొడుకు నాగచైతన్య కూడా కలుస్తున్నారు. ఈ తండ్రీ కొడుకులిద్దరూ తాతామనవళ్లలా కనిపించనున్నారు. తొలి భాగంలో నాగ్ సరసన నటించిన రమ్యకృష్ణ మలి భాగంలోనూ ఉంటారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట. కథ బాగా కుదిరిందని, ప్రతి పాత్ర ఆడి యన్స్‌కు కనెక్ట్ అయ్యేలా కల్యాణ్ కృష్ణ స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దారని తెలిసింది. అంటే ఈసారి బంగర్రాజు భలే నాయనా అనిపిస్తాడన్నమాట. ప్రీ–ప్రొడక్షన్ పనులను త్వరలోనే కంప్లీట్ చేసి సినిమాను జూన్‌లో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని టీమ్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘మన్మథుడు’ సినిమా సీక్వెల్ చేయడానికి నాగార్జున గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమా కాకుండా బాలీవుడ్లో ‘బ్రహ్మాస్త్ర’ అనే పీరియాడికల్ మూవీలో నాగార్జున ఓ కీ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
తాతామనవడు
నాగార్జున, నాగచైతన్య నిజజీవితంలో తండ్రీ కొడుకులు. కానీ చూడ్డానికి మాత్రం అన్నదమ్ముల్లా ఉంటారని అక్కినేని అభిమానులు సరదాగా చెప్పుకుంటుంటారు. ఇప్పుడు నాగార్జున, నాగచైతన్య తాతామనవళ్లుగా నటించబోతున్నారు. రెండేళ్ల క్రితం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున చేసిన బంగార్రాజు క్యారెక్టర్ ఆడియన్స్‌ను బాగా మెప్పించింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్లోనే ‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. అయితే ఇందులో నాగచైతన్య కూడా నటిస్తారు. బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు. ఈ సినిమా షూటింగ్ వేసవిలో ఆరంభం కానుందని సమాచారం. ఇంతకుముందు ‘మనం’ సినిమాలో నాగార్జునకు నాన్న పాత్రలో నాగచైతన్య కనిపించారు. ఇప్పుడు ఈ చిత్రం కోసం మనవడిగా మారారు. ఈ సంగతి ఇలా ఉంచితే... 2002లో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి కూడా స్వీకెల్ చేస్తున్నారట నాగార్జున. ఈ సినిమాకు నటుడు, ‘చిలసౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారు. మార్చిలో ఈ సినిమా షూటింగ్ పోర్చ్గల్లో స్టార్ట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. -
బంగార్రాజు ఈజ్ బ్యాక్
2016 సంక్రాంతికి బంగార్రాజుగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నాగార్జున ఏ రేంజ్లో అల్లరి చేశారో తెలిసిందే. ఇందులోని బంగార్రాజు పాత్రకు ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం అని పలు సందర్భాల్లో నాగార్జున పేర్కొన్నారు కూడా. బంగార్రాజు తిరిగి రావడానికి రంగం సిద్ధం అయింది. మార్చిలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. ఈ ప్రీక్వెల్‌కు సంబంధించిన కథను దర్శకుడు కల్యాణ్ కృష్ణ పూర్తి చేశారట. స్క్రిప్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావచ్చాయట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఫస్ట్ పార్ట్‌లో నాగార్జున సరసన నటించిన రమ్యకృష్ణ, మిగతా తారాగణమంతా కనిపిస్తారో లేదో వేచి చూడాలి. సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. కేవలం బంగార్రాజు పాత్రతో పూర్తి కథంటే ‘సోగ్గాడే..’ కంటే రెండింతల ఎనర్జీతో నాగ్ కనిపిస్తారని ఊహించవచ్చు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ద్వారా దర్శకుడిగా పరిచయమైన కల్యాణ్ కృష్ణ ప్రీక్వెల్‌ని మరింత ఎంటర్టైనింగ్గా ప్లాన్ చేస్తున్నారట. -
బంగార్రాజు నాగార్జునే
బంగార్రాజు పేరు వినగానే నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ గుర్తుకురాక మానదు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ‘వాసి వాడి తస్సాదియ్యా’ అంటూ బంగార్రాజు పాత్రలో నాగ్ పల్లెటూరి సోగ్గాడిగా అలరించారు. ‘సోగ్గాడే చిన్నినాయన’కు ప్రీక్వెల్‌గా నాగార్జునతో ‘బంగార్రాజు’ సినిమాకు ప్లాన్ చేశారు కల్యాణ్ కృష్ణ. కానీ, ఇప్పుడా సినిమా ప్రస్తావన లేకపోవడంతో నాగ్ ఆ సినిమా చేయడం లేదనీ, రవితేజతో ‘బంగార్రాజు’ తీసేందుకు కల్యాణ్ రెడీ అవుతున్నారనే వార్త షికారు చేస్తోంది. రవితేజకు కథ కూడా వినిపించారట. ‘‘అసలు ఆ రూమర్ ఎలా వచ్చిందో అర్థం కావడంలేదు. ‘బంగార్రాజు’ కథ ఒక వెర్షన్ రాశా. అది నాగ్‌సార్‌కి అంతగా నచ్చకపోవడంతో వేరేలా తయారు చేస్తున్నా. ఇప్పటికీ, ఎప్పటికీ ‘బంగార్రాజు’ నాగార్జున సారే. రవితేజకు నేను కథ చెప్పిన విషయం వాస్తవమే. కానీ, అది వేరే కథ. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని క్లారిటీ ఇచ్చి, రూమర్లకు ఫుల్స్టాప్ పెట్టారు. ప్రస్తుతం వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ సినిమా రూపొందించే పనిలో ఉన్నారు కల్యాణ్ కృష్ణ. మరి నాగార్జున, వెంకటేశ్–నాగచైతన్య, రవితేజ.. ఎవరి సినిమా ముందు సెట్స్‌పైకి వెళుతుందన్నది సస్పెన్స్. వారి డేట్స్‌ని బట్టి ఎవరితో సినిమా ముందు మొదలవుతుందో త్వరలో తెలుస్తుంది.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్‌పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్‌దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్‌ను గెలిపించు స్వామీ..
Advertisement