ఫేస్ బుక్, వాట్సప్ ముఖం చాటేశాయి! | Sakshi
Sakshi News home page

ఫేస్ బుక్, వాట్సప్ ముఖం చాటేశాయి!

Published Tue, Jan 27 2015 12:13 PM

ఫేస్ బుక్, వాట్సప్ ముఖం చాటేశాయి! - Sakshi

సోషల్‌నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ తో సహా , వాట్సప్ మెసెంజర్లు మంగళవారం మధ్యాహ్న ప్రాంతంలో స్తంభించిపోయాయి. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ రెండు ప్రధాన నెట్ వర్క్ లతో పాటు, ఇప్పుడిప్పుడే విస్తృతం అవుతున్న మరో సోషల్‌నెట్ వర్కింగ్ సైట్ ‘ఇన్‌స్టాగ్రామ్’ కూడా దాదాపు నిలిచిపోయింది. మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి ఫేస్ బుక్ లోకి పోస్టింగ్ చేయడం సాధ్యం కావట్లేదు. అలాగే, అప్పటివరకు ఫేస్ బుక్ లో ఉన్నవాటిని చదవండం కూడా ఎవరికీ కుదరడంలేదు.

 

దీంతో వినియోగదార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫేస్ బుక్ , వాట్సప్ లు ముఖం చాటేయడంతో నెటిజన్లకు ప్రపంచమే ఒక్కసారిగా స్తంభించినంత పని అయ్యింది. దీనిపై ట్విట్టర్ వేదికగా విపరీతమైన వ్యాఖ్యనాలు వచ్చాయి. అయ్యో.. ఫేస్ బుక్ పోయిందే, ఇక మనుషులు మనుషులతోనే నేరుగా మాట్లాడుకోవాలా అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. ఫేస్ బుక్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్ కి లక్షలాది రీట్వీట్లు వస్తున్నాయి. ఫేస్ బుక్ లేదంటే ఇక లైకులు రావు, ప్రేమ కూడా ఉండబోదని ఓ అమ్మాయి ఏడుస్తున్నట్లు కూడా ఫొటోలు పెట్టేశారు. మొత్తానికి ఫేస్ బుక్ లేని ప్రపంచం ఎలా ఉంటుందన్న విషయం ఒక్కసారిగా అందరికీ తెలిసి వచ్చింది.  సుమారు అరగంట తరువాత ఫేస్ బుక్ రీస్టోర్ కావడంతో నెటిజన్లు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement