తుఫాను ఢీకొని మహిళ మృత్యువాత | Sakshi
Sakshi News home page

తుఫాను ఢీకొని మహిళ మృత్యువాత

Published Sat, Mar 4 2017 2:51 PM

women died in road accident

హైదరాబాద్‌: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సింగరేణి కాలనీ సమీపంలో శనివారం మధ్యాహ్నం​ జరిగిన ప్రమాదంలో ఒక మహిళ చనిపోయింది. చంపాపేట్ సూర్యా నగర్ కాలనీ నుంచి కర్మాన్ ఘాట్‌కు స్కూటీపై వెళ్తున్న వెంకటమ్మ(45) ను వేగంగా వచ్చిన తుఫాను వాహనం ఢీకొనటంతో ఆమె అక్కడికక‍్కడే చనిపోయింది. ఈ మేరకు తుఫాను వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement