పదహారు ‘రకాలుగా’ పోలీసు విధులు | Sakshi
Sakshi News home page

పదహారు ‘రకాలుగా’ పోలీసు విధులు

Published Wed, Jan 13 2016 11:57 PM

పదహారు ‘రకాలుగా’ పోలీసు విధులు - Sakshi

మెరుగైన పనితీరు కోసం విభజించిన కమిషనర్
 విభాగాల వారీగా ప్రతిభను గుర్తిస్తున్న అధికారులు
కోర్టు విధులు సమర్థంగా నిర్వర్తించిన వారికి రివార్డ్స్
కమిషనరేట్‌లో సమీక్షించిన నగర పోలీసు కమిషనర్

 
సిటీబ్యూరో: నగర పోలీసుల పనితనం మెరుగుపర్చడంతో పాటు విధి నిర్వహణ సులభతరం చేయడానికి ఠాణాల్లోని విధుల్ని 16 రకాలుగా విభజిస్తూ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిబ్బంది అర్హత, ఆసక్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా విధు ల్ని అప్పగించడంతో పాటు వారికి అవసరమైన అదనపు శిక్షణ సైతం ఇప్పించారు. ఈ 16 రకాలైన విధుల్లో ప్రతి అంశంలోనూ ఉత్తమ పనితనం కనబరిచిన సిబ్బందికి రివార్డులు అందిస్తున్నారు. తొలివిడతగా కోర్టు విధులు సమర్థంగా నిర్వర్తించి, న్యాయస్థానాల్లో నిందితులను దోషులుగా నిరూపించడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందికి బుధవా రం కమిషనర్ మహేందర్‌రెడ్డి రివార్డులు అందించారు. నగరంలో 63 పోలీసుస్టేషన్లకు సంబంధించి సిబ్బంది పనితీరును సబ్-డివిజన్ స్థాయిలో ఏసీపీలు, జోన్ స్థాయిలో డీసీపీలు సమీక్షిస్తుండగా...కమిషనరేట్ స్థాయి లో స్వయంగా కమిషనర్ సమీక్షిస్తున్నారు. నగరంలోని 13 ఠాణాలకు సంబంధించిన 18 కీలక కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేసిన 14 మందికి కమిషనర్ రివార్డులందించారు. బంజారాహిల్స్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన కేబీఆర్ పార్క్ కాల్పులు, కిడ్నాప్ ఘట నలో నిందితుడిగా ఉన్న ఓబులేశ్‌ను దోషిగా నిరూపించడంలో కీలక పాత్ర పోషించిన హెడ్-కానిస్టేబుల్ గోవింద్ నాయుడు, కానిస్టేబుల్ బాలసైదయ్య సైతం రివార్డు అందుకున్న వారిలో ఉన్నారు.
 
విధుల విభజన ఇలా
రిసెప్షన్ సిబ్బంది, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, బ్లూకోల్ట్స్ గస్తీ, మొబైల్ పెట్రోలింగ్, కోర్టు విధులు, వారెంట్ ఎగ్జిక్యూషన్ విధులు, సమన్ల ఎగ్జిక్యూషన్ విధు లు, సాంకేతిక విధులు, దర్యాప్తు, నేర విభాగం, మెడికల్ సర్టిఫికెట్ స్టాఫ్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, సాధారణ విధులు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ల విధులు, ఇన్‌స్పెక్టర్ల విధులు

రివార్డులు పొందింది వీరే..
హెడ్-కానిస్టేబుల్ గోవింద్ నాయుడు, కానిస్టేబుల్ బాల సైదయ్య (బంజారాహిల్స్), ఏఎస్సై మహ్మద్ నజీమ్ అలీ (షాహినాయత్‌గంజ్), కానిస్టేబుల్ శ్రీని వాస్ (అబిడ్స్), కానిస్టేబుల్ కిరణ్‌యాదవ్ (చిక్కడపల్లి), హెడ్-కానిస్టేబుల్ వీఆర్ సుబ్బారావు (అఫ్జల్‌గంజ్), ఏఎస్సై ఇ.జగన్నాథ్‌రెడ్డి (సైదాబాద్), కానిస్టేబుల్ రాజేష్‌కుమార్ (డబీర్‌పుర), హెడ్-కానిస్టేబుల్ రంగస్వామి (అంబర్‌పేట), కానిస్టేబుల్ రాజు (మంగళ్‌హాట్), ఏఎస్సై నరేంద్ర (కుల్సంపుర), కానిస్టేబుళ్లు ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ (చిలకలగూడ), కానిస్టేబుల్ రమేష్ (సంతోష్‌నగర్), హెడ్-కానిస్టేబుల్ మోహన్‌రావు (పంజగుట్ట).
 

Advertisement
 
Advertisement
 
Advertisement