కలెక్టర్ ఎదుటే వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

కలెక్టర్ ఎదుటే వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

Published Tue, Nov 18 2014 1:30 AM

old couples suicide attempt in front of collector

మహబూబ్‌నగర్: దీర్ఘకాలంగా భూహద్దు సమస్య పరిష్కా రం కావడం లేదని, జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని, కబ్జాదారుల ఆగడాలను భరించలేకపోతున్నామని కలత చెందిన వృద్ధ దంపతులు మహబూబ్‌నగర్ కలెక్టర్ ఎదుటే ఆత్మహత్యకు యత్నిం చారు. బాధితుల కథనం మేరకు.. మద్దూరు మండలం దోరేపల్లికి చెందిన హన్మంత్, వెంకటమ్మ దంపతులకు మూడున్నర ఎకరాల పొలం ఉంది. పక్క పొలానికి చెందిన వ్యక్తి అందులో కొంతభాగాన్ని ఆక్రమించాడు.

పొలాన్ని కొలిచి తన భాగాన్ని తనకు ఇప్పించాల్సిందిగా హన్మంత్ నాలుగేళ్లుగా అధికారులకు విన్నవిస్తూ వస్తున్నాడు. పైగా కబ్జాదారుడి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ప్రియదర్శినికి తమ సమస్యను చెబుతూనే వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగేందుకు యత్నించారు. అక్కడే ఉన్న సిబ్బంది వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. హన్మంత్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ఈ ఘటనపై విచారణ చేయాలని  కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement