స్పెషల్ కౌన్సెల్స్‌గా మోహన్‌రావు, వివేక్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

స్పెషల్ కౌన్సెల్స్‌గా మోహన్‌రావు, వివేక్‌రెడ్డి

Published Sun, Dec 21 2014 3:04 AM

Mohan Rao, Vivek Reddy elected as special counsel

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం తరఫున వివిధ ట్రిబ్యునళ్లు, భూ ఆక్రమణల నిరోధక ప్రత్యేక న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అడ్వొకేట్ జనరల్ (ఏజీ)కి సహకరించేందుకు ఇద్దరు న్యాయవాదులను స్పెషల్ కౌన్సెల్స్‌గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

న్యాయవాదులు మోహన్‌రావు, కె.వివేక్‌రెడ్డిలను స్పెషల్ కౌన్సెల్స్‌గా నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అడ్వొకేట్ జనరల్‌పై పెరిగిపోతున్న పని ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నియామకాలు చేసింది. వీరిద్దరూ ఏజీ ఆదేశాల మేరకు, ఆయన పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది.  మూడేళ్లపాటు వీరు తమ పదవుల్లో కొనసాగుతారు.

Advertisement
 
Advertisement
 
Advertisement