కుట్టుపట్టు | Sakshi
Sakshi News home page

కుట్టుపట్టు

Published Thu, Feb 16 2017 11:29 PM

saree and hand suing silk sarees special storie



ముందే పట్టు పట్టుకుందామన్నా పట్టు దొరకదుఅలా జారిపోయే సిల్క్‌ ఇది.దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్‌!ఈ చేతి కుట్టు తర్వాతచీర మీదపట్టు దొరుకుద్ది గానీధరే పట్టు చిక్కదు.చూసి ఆనందిద్దాంవీలైనప్పుడు కొందాంలేదంటే...ఈ కుట్టు పట్టుకే కాదుఅన్ని చీరలకూక్రియేటివ్‌గా కుట్టితక్కువలో కొట్టేద్దాం.


నలుపు రంగు చీరకు వెడల్పాటి అంచులా ఎంబ్రాయిడరీ పనితనం జిలుగులు పోతోంది. చిరు నగవులతో పోటీపడుతూ కొత్త అందాలు విరబూస్తోంది.

జరీతో అల్లిన మామిడిపిందెల డిజైన్‌ అంచుజత చేస్తే ఏ రంగు చీరైనా ఇలా ముచ్చటగారూపుకట్టాల్సిందే!

⇔  రాణీపింక్‌ చీరపై జరీ దారాలు, ముత్యాల వరుసలు కొంగొత్తగా రూపుకట్టి కొత్త కళను మోసుకొచ్చాయి.
పట్టుచీరే బంగారం. ఇక ఎంబ్రాయిడరీ హంగులు తోడైతే వేడుకకే సింగారం.
పచ్చని చీరకు గులాబీ రంగు అంచు సంప్రదాయాన్ని కూడా సై్టలిష్‌గా మార్చేస్తుంది.
జరీ జిలుగులతోనూ, అద్దాలతోనూ అంచుగా రూపు కట్టిన బంగారు రంగు చీర వేదికపై వెలుగు పూలు వెదజల్లుతుంది.

Advertisement
Advertisement