ట్రైవ్యాలీ వర్సిటీ అధినేత దోషి: అమెరికన్ కోర్టు | Sakshi
Sakshi News home page

ట్రైవ్యాలీ వర్సిటీ అధినేత దోషి: అమెరికన్ కోర్టు

Published Thu, Mar 27 2014 1:14 PM

ట్రైవ్యాలీ వర్సిటీ అధినేత దోషి: అమెరికన్ కోర్టు

వందలాది తెలుగు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసిన అమెరికన్ యూనివర్సిటీ ట్రైవాలీ సంస్థాపకులు సూసన్ జియావో పింగ్ 31 కారణాల వల్ల దోషి అని అమెరికా న్యాయస్థానం నిర్ధారించింది. తప్పుడు వీసాలతో భారతీయ విద్యార్థులను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను రప్పించి, వారికి అడ్మిషన్ ఇప్పించినందుకు ఆయన దోషి అని కోర్టు తెలిపింది. ఆమెకి ఎంత శిక్ష పడుతుందన్నది జూన్ 20 న న్యాయస్థానం ప్రకటిస్తుంది.

కాలిఫోర్నియాలోని ట్రైవాలీ యూనివర్సిటీ దాదాపు 5.9 మిలియన్ డాలర్ల మనీ లాండరింగ్ కి పాల్పడింది. ఆ డబ్బు చెల్లించిన వారిలో ఎక్కువ మంది భారతీయులే. ఆ యూనివర్సిటీ మొత్తం విద్యార్థుల్లో 90 శాతం మంది మన దేశానికి చెందిన వారే. తప్పుడు వీసాలతో వారిని అమెరికాకి తీసుకువెళ్లడమే కాక, వారిని దాదాపు నిర్బంధంలో ఉంచినంత పని చేసింది. వారి కాళ్లకు ట్రాకర్లు అమర్చి, వారు ఎక్కడికి వెళ్తున్నారో నిఘావేసి ఉంచింది.

ట్రైవ్యాలీ గుట్టు నవంబర్ 2011 న రట్టు అయింది. 43 ఏళ్ల సూసన్ పై తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం, ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పడం, వీసా కుంభకోణం, తప్పుడు ఈ మెయిల్స్ పంపడం వంటి 31 ఆరోపణలు నమోదయ్యాయి. అంతే కాదు. కొందరు ప్రొఫెసర్ల పేర్లను వారికి తెలియకుండా తన యూనివర్సిటీ బ్రోచర్లలో వేసుకుంది.

ఏది ఏమైనా ఆ యూనివర్సిటీలో చదివిన వందలాది భారతీయ విద్యార్థులకు దారీతెన్నూ లేకుండా పోయింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement